ఇక స్వచ్చంధంగా లాక్ డౌన్ కి  సిద్ధపడండి !  

కరోనా విజృంభిస్తోన్నా రోజురోజుకు పెరుగుతున్నా పాజిటివ్ కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోడు అని రోజూ డైలీ సీరియల్ లా మనమే నేమరువేసుకోవలేమో. విచిత్రం ఏమిటంటే కరోనా కట్టడిలోనే ఉందని ప్రభుత్వం ఇప్పటికీ చెబుతుంది. ఇంతకన్నా అబద్ధం మరొకటి ఉండదు. నిజానికి రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేసినప్పుడు కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. ఎప్పుడైతే లాక్ డౌన్ సడలింపులు భారీగా ఇచ్చారో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తాజాగా నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే వైరస్ ఇంతలా విజృంభిస్తే భాగ్య నగరం కరోనా నగరంగా మారిపోతుంది.

కాగా కరోనా కేసుల సంఖ్య విని ప్రజలు భయాందోళనకు గురవుతోన్నా కేసిఆర్ ప్రభుత్వం పరిస్థితి చేయి దాటిపోలేదనే బుకాయిస్తోంది. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్ తప్పేలా లేదు. మహానగరం పూర్తిగా మహమ్మరి గుప్పిట్లోకి వెళ్లక ముందే మనం బయట తిరగకుండా ఇంటి నుంచే పనులను చక్కబెట్టుకోవాలి. లేకపోతే కరోనా పేషెంట్ల లిస్టులోకి మనం చేరిపోవాల్సి వస్తోంది. తెలంగాణలో ఒక్కరోజే సుమారుగా 900 కరోనా కొత్త కేసులు నమోదు అవుతుంటే.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 700లకు పైగా కొత్త కేసులు నమోదవుతుండటం గమానార్హం.

జీహెచ్ఎంసీలో కరోనా విజృంభిస్తుండటంతో హైదరాబాద్‌ కిరాణ మర్చంట్‌ అసోసియేషన్‌ ముఖ్యమైన నిర్ణయం తీసుకుని కిరణా దుకాణాలు స్వచ్చంధంగా మూసివేయనున్నట్లు ప్రకటించారు. మొత్తానికి హైదరాబాద్‌లో కరోనా విజృంభణతో వ్యాపారులు బెంబెలెత్తిపోతున్నారు. దీంతో ఎవరికీవారు స్వచ్ఛంధంగా లాక్ డౌన్ విధించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా స్వచ్చంధంగా లాక్ డౌన్ సిద్ధపడుతున్నారు. మరోవైపు హైదరాబాద్ లో చేస్తున్న కరోనా టెస్టులను అర్ధాంతరం నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది.