AP & TS

బయటపడిన లోకేష్ సామర్ధ్యం

 తెలంగాణా ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు పుత్రరత్నం నారా లోకేష్ సామర్ధ్యం మరోసారి బయటపడింది. నిజానికి కొడుకు సామర్ధ్యం గురించి చంద్రబాబునాయుడుకన్నా ఎక్కువ ఇతరులకు తెలుస్తుందని అనుకునేందుకు లేదు. అందుకనే తెలంగాణా ఎన్నికల్లో ఎక్కడ కూడా లోకేష్ ఆనవాలు కూడా లేకుండా దూరంగా ఉంచేశారు. లోకేష్ నోరిప్పితే ఏమవుతుందో గతంలో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లోనే అందరూ చూశారు. అప్పటి నుండి లోకేష్ సామర్ధ్యం, పాండిత్యం రోజురోజుకు పెరుగుతోందే కానీ ఏమాత్రం తగ్గటం లేదు. అందుకనే తెలంగాణా ఎన్నికల్లో లోకేష్ ను తిరగకుండా చంద్రబాబు దూరం పెట్టేశారు.

 

అప్పటికీ విశాఖపట్నం పర్యటనలో ఆమధ్య పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తెలంగాణా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని బహిరంగంగానే చెప్పారు. అయినా చంద్రబాబు మనసు కరగలేదు. ఎన్నికల ప్రచారంలో కాదుకదా కనీసం కుకట్ పల్లిలో పోటీ చేస్తున్న సోదరి చుండ్రు అలియాస్ నందమూరి సుహాసిని ప్రచారంలో కూడ దింపలేదు. రాదలుచుకోని జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్ రామ్ లు వస్తున్నట్లు తప్పుడు కథనాలు వండి వార్చారేగానీ లోకేష్ రాని విషయం మాత్రం ఎక్కడా ప్రస్తావనకు రాకుండా జాగ్రత్తపడ్డారు.

 

పోయిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో అన్నీ తానై లోకేష్ ప్రచారం చేశారు. మొత్తం 150 డివిజన్లలోని చాలా చోట్ల ప్రచారం చేస్తే టిడిపికి వచ్చింది 2 డివిజన్లు మాత్రమే. అదే సమయంలో లోకేష్ ప్రచారం చేసిన ప్రతీ డివిజన్ లో ఎక్కడ కూడా టిడిపి గెలవలేదు. పైగా రోడ్డు షోల్లో మాట్లాడినపుడు లోకేష్ పాండిత్యమంతా బయటపడి నవ్వుల పాలయ్యాడు. టిడిపికి ఓట్లేస్తే ఉరేసుకున్నట్లేనని, దేశంమొత్తం మీద అవినీతి, కులగజ్జి ఉన్న పార్టీ తెలుగుదేశంపార్టీ మాత్రమేనని బహిరంగ సభల్లోనే చెప్పిన ఘనత, ధైర్యం లోకేష్ కు మాత్రమే ఉంది.

 

బహిరంగసభల్లో లోకేష్ స్పీచ్ తర్వాత ఎన్నోసార్లు చంద్రబాబు తలపట్టుకున్నారు. ఇపుడు గనుక లోకేష్ ను ప్రచారానికి పిలిపిస్తే వస్తాయనుకుంటున్న నాలుగు సీట్లు కూడా రాదన్న భయంతోనే దూరంగా ఉంచేసినట్లున్నారు. కాకపోతే లోకేష్ కు బదులుగా మామయ్య నందమూరి బాలకృష్ణతో ప్రచారం చేయించారు లేండి. బాలయ్య కూడా అల్లుడు లోకేష్ లేని లోటును శక్తిమేరకు పూడ్చారు. మొత్తానికి చంద్రబాబు మాత్రం చాలా తెలివిగా కొడుకును పక్కనపెట్టి వియ్యంకుడిని మాత్రం రంగంలోకి దింపారు.

Telugurajyam
Read
Special
Ads

Copyright © 2018 TeluguRajyam

To Top