fbpx
Home Editors Choice కరెంట్ పై కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే! ఇదీ నిజం!

కరెంట్ పై కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే! ఇదీ నిజం!

(శ్రవణ్ బాబు)

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం అంటూ సాధిస్తే అది కేవలం రెండు కారణాల వలనే అని చెప్పుకోవాలి. అది ఒకటి – బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాల రూపంలో అందిస్తున్న తాయిలాలు. రెండు – నిరంతర విద్యుత్ సరఫరా. అందుకే కేసీఆర్ ప్రతి ఎన్నికల ప్రచారసభలోనూ ఈ రెండింటి గురించి ఊదరగొడుతుంటారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరా గురించి అయితే ఆయన మాటలకు అడ్డూ ఆపు ఉండదు.

విభజన జరిగితే తెలంగాణ అంధకార బంధురమవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, దానిని తన ప్రతిభతో తారుమారు చేసి రాష్ట్రంలో పవర్ కట్స్ లేకుండా చేశానని కేసీఆర్ అంటుంటారు. తెలంగాణలో మాత్రమే ఈ ఘనత సాధ్యమైందని, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పవర్ కట్స్ ఉన్నాయని, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో కూడా చీకటి రాజ్యమేలుతోందని చెబుతుంటారు. నిరంతర విద్యుత్ సరఫరా వెనక తన నిరంతర కృషి ఉందని, నిద్రాహారాలు మాని గంట గంటకూ విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షిస్తుండటం వలనే ఇది సాధ్యమయిందని అంటూ కేసీఆర్ చెప్పుకొస్తారు. అయితే, ఈ మాటలన్నీ నూటికి నూరు పాళ్ళూ శుద్ధ అబద్ధం. అది ఎలాగో చూడండి.

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2014 జూన్ 3న ప్రమాణ స్వీకారం చేసేనాటికి రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితి దారుణంగా ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చాలా రోజులు విపరీతమైన పవర్ కట్స్ విధించారు. హైదరాబాద్ నగరంలో ఆరుగంటలు విధిస్తే, జిల్లాలలో 8నుంచి 12 గంటలపాటు పవర్ కట్స్ ఉండేవి. అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో అనేకచోట్ల రైతులు, వ్యాపారవేత్తలు, పరిశ్రమల యజమానులు రోడ్డెక్కి ఆందోళనలు కూడా చేశారు. విభజన తర్వాత మిగులు బడ్జెట్ ఏర్పడటంతో తెలంగాణకు నిధుల కొరత లేదు. బయటనుంచి విద్యుత్ కొనుగోలు చేయటానికి ప్రభుత్వం ప్రయత్నించింది. ఎక్కడనుంచైనా, ఎంత రేటుకైనా కొనుగోలు చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ రంగంలో మిగులులో ఉన్న ఛత్తీస్ గడ్ ప్రభుత్వంతో విద్యుత్ సరఫరాకై తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒక విచిత్ర సమస్య నెలకొంది. డబ్బులున్నా తినలేని పరిస్థితిలాగా, విద్యుత్ కొనుగోలు చేద్దామని అనుకున్నప్పటికీ దానిని తీసుకోవటానికి ట్రాన్స్ మిషన్ లైన్స్ లేవు. కొత్త లైన్స్ నిర్మాణానికి అప్పుడు మొదలుపెట్టినా మూడేళ్ళ సమయం పడుతుందని అంచనాల్లో తేలింది. రాష్ట్రంలో ఈ పరిస్థితి ఆరునెలలపాటు కొనసాగింది.   

2014 నవంబర్ నుంచి పరిస్థితి మెరుగుపడటం ప్రారంభించింది. వర్షాలు లేకపోవటంతో రైతుల విద్యుత్ అవసరాలు తగ్గటంవలన డిమాండ్ తగ్గింది. మరోవైపు, దేశవ్యాప్తంగా మారిన విద్యుత్ రంగ పరిస్థితి కేసీఆర్ కు కలిసొచ్చింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో విద్యుత్ శాఖ బాధ్యతలు తీసుకున్న మంత్రి పియూష్ గోయెల్ అద్భుతమైన పనితీరుతో దేశవ్యాప్తంగా విద్యుత్ రంగ పరిస్థితి ఒక్కసారిగా టర్న్ ఎరౌండ్ అయింది. గతంలో విద్యుత్ సప్లై తక్కువగానూ, డిమాండ్ ఎక్కువగానూ ఉంటుండగా, 2015 చివరినాటికి ఆ పరిస్థితి తారుమారై యూనిట్ విద్యుత్ ధర ఓపెన్ మార్కెట్ లో రు.2.35కు పడిపోయింది. 2014లో కూడా ఈ ధర రు.10 – 15 మధ్య ఉండేది. ఎన్టీపీసీ వంటి ప్రభుత్వరంగ విద్యుత్ ప్లాంట్లలో ఎవరూ కొనుగోలు చేయకపోవటంతో 11,000 మెగావాట్ల విద్యుత్ వృథాగా పడిఉండే పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిసిటీ ట్రేడింగ్ ఎక్స్ ఛేంజిలలో రేట్లు విపరీతంగా పడిపోయాయి(https://energy.economictimes.indiatimes.com/news/power/dark-future-ahead-11000-mw-thermal-power-capacity-lying-idle-largest-outage-is-in-the-north/50556138).

కేసీఆర్ కు కలిసొచ్చిన మరో విషయం ఏమిటంటే 2015 మార్చి నాటికి ఒక ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభమవటం. ఏపీ కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ వారి 700 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ మార్చిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. ప్రభుత్వం వారినుంచి కొనుగోలు చేసిన విద్యుత్ తో తెలంగాణలో పరిస్థితి మెరుగుపడింది. మరోవైపు వారికే చెందిన 500 మెగావాట్ల మరో ప్లాంట్ అదే సంవత్సరం జూన్ నుంచి ప్రారంభమవటంతో ఇక పవర్ కట్స్ నిలిపేశారు. అయితే ఈ విద్యుత్ కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఈ ప్రైవేట్ సంస్థలనుంచి అత్యధిక ధరకు కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, పారిశ్రామికవేత్తలు, చిన్న పరిశ్రమల యజమానులు విద్యుత్తును ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయటం మానేసి చౌకగా వస్తున్న ఓపెన్ మార్కెట్ నుంచి తీసుకోవటం ప్రారంభించారు. ఇది కూడా తెలంగాణ ప్రభుత్వానికి కలిసొచ్చింది. పరిశ్రమలనుంచి డిమాండ్ తగ్గిపోయింది. ఈలోపు ఛత్తీస్ గడ్ నుంచి విద్యుత్ లైన్ల నిర్మాణంకూడా పూర్తికావటంతో ఒప్పందం ప్రకారం అక్కడనుంచి కూడా విద్యుత్ రావటం ప్రారంభించింది. దీనితో ఒకనాడు విద్యుత్ రంగంలో తీవ్ర కొరతతో బాధపడ్డ తెలంగాణ ఇప్పుడు మిగులులోకి వచ్చింది. ఇదే కాదు దేశవ్యాప్తంగా ఏపీతో సహా పలు రాష్ట్రాలు మిగులులోనే ఉన్నాయి.

అలా దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో మారిన పరిస్థితులు తెలంగాణకు కలిసివచ్చాయి. మాటల మాంత్రికుడైన కేసీఆర్ దానిని విజయవంతంగా తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నారు. తెలంగాణ తప్పితే దేశమంతా అంధకార బంధురంలో ఉన్నదన్నట్లు జనాన్ని నమ్మిస్తున్నారు. మరి కాంగ్రెస్ వారు కూడా దీనిని ఎందుకనో తిప్పికొట్టకపోవటంతో ప్రజలు దీనిని కేసీఆర్ ఘనతగానే భావిస్తున్నారు.

(శ్రవణ్ బాబు, సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్)

తెలుగురాజ్యం ప్రత్యేకం

విజయ్ ఆంటోనీ ‘కిల్లర్’ ట్రైలర్ రివ్యూ!

  ‘బిచ్చగాడు’ విజయ్ ఆంటోనీ ‘కిల్లర్’ ట్రైలర్ విడుదలయ్యింది. తమిళంలో ‘కలైగరన్’ (హంతకుడు) గా నిర్మించి తెలుగులోకి డబ్ చేసిన ‘కిల్లర్’ కి ఆండ్రూ లూయిస్దర్శకత్వం వహించాడు. ఇతను 2012 లో కొత్త వాళ్లతో...

బాబు గారి ‘Is It not వివక్షత’ కి ఈసీ కౌంటర్?

చంద్ర బాబు గారు ఎలక్షన్ కమిషన్ ని కలిసిన తర్వాత మాట్లాడుతూ పోలింగ్ జరిగిన 30 రోజుల తర్వాత ఎలా రీపోలింగ్ నిర్వహిస్తారని , is this not వివక్షత అంటూ ప్రశ్నించారు....

‘ఎబిసిడి’ రివ్యూ – చిన్న మహర్షి అవుదామనుకుంటే…

ఐదు సినిమాల అల్లుశిరీష్ యువహీరోగా నిలదొక్కుకోవడానికి స్ట్రగుల్ చేస్తున్నాడు. ఆరో సినిమాగా నాలుగక్షరాల ‘ఎబిసిడి’ కొచ్చాడు. రీమేక్ తో, కొత్త దర్శకుడితో ఒక ప్రయోగం చేస్తున్నట్టు చెప్పాడు. అట్టహాసంగా 600 పై చిలుకు...

అత్యంత ప్రజాధారణ

తాజా వార్తలు

‘సీత’వివాదం: తేజ క్షమాపణ చెప్పాల్సిందే,లేదా కేసు

వివాదం లేనిదే పెద్ద సినిమా ఉండదా అనే విధంగా ప్రతీ సారి ఏదో వివాదం చెలరేగుతూనే ఉంది. తాజాగా తేజ దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా.. కాజల్ అగర్వాల్ టైటిల్ పాత్రలో నటించిన ‘సీత’...

‘టిక్‌ టాక్‌’ టాప్ సెలబ్రిటీని దారుణంగా చంపేసారు

ఇండియాలో పాపులర్ అయిన టిక్ టాక్ యాప్‌‌లో లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న మోహిత్ మోర్ అనే 24ఏళ్ల యువకుడు హత్యకు గురవ్వడం ఢిల్లీలో సంచలనంగా మారింది. ముగ్గురు గుర్తు తెలియని...

‘జబర్దస్థ్’ లో సడెన్ ట్విస్ట్… సీన్ లోకి సీనియర్ కమిడియన్

తెలుగు టీవీ రంగంలో బాగా పాపులర్ అయిన కామెడీ షో 'జబర్దస్థ్' అనేది ఎవరూ కాదనిలేని సత్యం. ఆ పోగ్రాం సక్సెస్ అవటంతో ఎక్స్ ట్రా జబర్ధస్త్ కూడా మొదలు పెట్టారు. అదీ...

న్యూడ్ ఫొటోలు పంపి షాక్ ఇచ్చిన సింగర్ చిన్మయి

గత కొంతకాలంగా చిన్మయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ముఖ్యగా మీటూ అంటూ తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ సంఘటనను వెలుగులోకి తెచ్చింది. అందులో భాగంగా ప్రముఖ తమిళ పాటల...

బాబూ బెల్లంకొండ ఏంటీ కామెడీ,నవ్వుకుంటున్నారు

బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ అనేది పడలేదు. అయితే తనకు హిందీలో పెద్ద మార్కెట్ ఉందని అంటున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. తన తాజా చిత్రం సీత ప్రమోషన్ లో...

అదనపు బలగాలపైనా మండిపోవటమేనా ?

కౌంటింగ్ సందర్భంగా గురువారం రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో కేంద్ర ఎన్నికల కమీషన్ అదనపు బలగాలను మోహరించింది. అదనపు బలగాలను మోహరించటంపైన కూడా చంద్రబాబునాయుడు మండిపోతున్నారు. ఎలక్షన్ కమీషన్ చేసే ప్రతీ పనినీ...

జపాన్ లో రానా తుఫాన్

అవును ..ఇప్పుడు జపాన్ లో దగ్గపాటి రానా సినిమాల తుఫాను వస్తోంది అక్కడ వరస పెట్టి ఆయన సినమాలు అన్నీ రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా బాహుబ‌లి ఫ్రాంచైజ్‌లో వ‌చ్చిన చిత్రాలు జపాన్‌లో విడుద‌ల...

వెయ్యి కోట్లకు చేరుకున్న బెట్టింగులు ?

రాష్ట్రంలో బెట్టింగుల జోరుతో మారు మోగిపోతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే పందెం రాయళ్ళు బరిలోకి దిగినా తర్వాత మెల్లిగా ఊపు తగ్గిపోయింది. పోలింగ్ ముగిసిన రోజు నుండి దాదాపు పది రోజులు బెట్టింగ్...

ఓడిపోతే….అందుకే సాకులు వెతుక్కుంటున్నారా ?

చూడబోతే  అలాగే ఉంది చంద్రబాబునాయుడు వ్యవహారం.   పదే పదే ఈవిఎంలుని వివి ప్యాట్లని ఒకటే దేశవ్యాప్తంగా చంద్రబాబు చేస్తున్న గోల చూస్తుంటే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు వాదనను కోర్టులు కొట్టేస్తున్న మళ్ళీ...

ఈ మంత్రి గెలుపు కష్టమేనా ?

చంద్రబాబునాయుడు క్యిబినెట్ లో మంత్రులందరూ రెండోసారి పోటీ చేశారు. అయితే వీరిలో ఎంతమంది గెలుస్తారనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. సరే మిగిలిన మంత్రుల సంగతి పక్కన పెడితే ఒక మంత్రి గెలుపోటముల విషయంలో మాత్రం...
 Nate Gerry Jersey