fbpx
Home National మోదీ రాహుల్ తలపడితే ఏమవుతుంది? : ఆసక్తికరమయిన CVOTER-IANS సర్వే

మోదీ రాహుల్ తలపడితే ఏమవుతుంది? : ఆసక్తికరమయిన CVOTER-IANS సర్వే

నరేంద్ర మోదీకి, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవికి నేరుగా ఎన్నికలు జరిగితే ఏమవుతుంది. దక్షిణాది రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలలో  రాహుల్ గాంధీకి మెజారిటీ వస్తుంది. ఈ రాష్ట్రాలతో పాటు పంజాబ్ చాయస్ కూడా రాహుల్ గాంధీయే. ఇక మిగతా దేశమంతా ప్రధానిగా మోదీకే ప్రాముఖ్యం ఇస్తాయి. ఈ విషయం Cvoter-IANS సర్వేలో వెల్లడయింది.

ఈ సర్వేని ఏప్రిల్ 19 న జరిపారు.రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీలు ప్రధాని పదవికి పోటీ పడితే, మీరెవరికి వోటేస్తారనే విషయం మీద ఈ సర్వే జరిగింది.

జాతీయ స్థాయిలో మాత్రం మోదీ కే అధిక్యత వచ్చింది.ఆయనకు రాహుల్ కంటే 26.10 శాతం ఆధిక్యత వచ్చింది.

రాష్ట్రాల విషయానికి వస్తే కేరళలో 64.96 శాతం మంది ప్రధానిగా రాహుల్ కే ఓటేస్తామని చెప్పారు. మలయాళ రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ వైపు కేవలం 23.97 శాతమ మంది మాత్రమే మొగ్గు చూపారు.

తమిళనాడులో రాహుల్ గాంధీని 60.91 శాతం సమర్థిస్తే, మోదీ మద్దతుదారులు కేవలం 23.97 శాతం మాత్రమే ఉన్నారు. ఇంక పంజాబ్ లో 37.04 శాతం రాహుల్ గాంధీ కావాలంటే 36.05 శాతం మోదీకి వోటేస్తామని చెప్పారు. ఈ రాష్ట్రాలన్నింటా బిజెపియేతర ప్రభుత్వాలున్నాయి.

ఈ సర్వే కోసం జాతీయ స్థాయిలో మొత్తంగా 11,932 మందిని సంప్రదించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 451 మందిని, కేరళలో 701 మందిని, తమిళనాడులో 533, పంజాబ్ లో 602 మందిని ప్రశ్నించారు.

ఆంధ్రలో మోదీ 11 శాతం వెనకబడి ఉన్నారు. కేరళలో 40.99 శాతం వెనకబడి ఉంటే, తమిళనాడులో 33.93 శాతం వెనబడి ఉన్నారు. ఇక పంజాబ్ ఈ గ్యాప్ బాగా తక్కువ . ఇది కేవలం 0.99 శాతమే.

ఉత్తరాది రాష్ట్రాలకొస్తే రాహుల్ గాందీ మీద మోదీకి హర్యానాలో 61.50 శాతం ఆధిక్యత ఉంది. హర్యానాలో రాహుల్ ను ప్రధానిగా ఇష్టపడేవారు కేవలం 14.92 శాతమే.

ఏప్రిల్ 18 న జరిపిన మరొక సర్వే ఇంకొక ఆసక్తి కరమయిన విషయాన్ని వెల్లడించింది. ఈ సర్వేల ప్రధాని మోదీ మీద సంతృప్తిగా ఉన్నారా , అంతసంతప్తిగా లేరా, సంతృప్తిగా లేరా అనే మూడు ప్రశ్నలతో 11,047 మంది లో సర్వే చేయడం జరిగింది.

మార్చి 7 నాటి ఇదే సర్వేతో పోలిస్తే ఏప్రిల్ 18నాటికి ప్రధాని పాపులారిటీ 16.55 శాతం పడిపోయింది. మార్చి ఏడు ఆయన మీద సంతృప్తి స్థాయి 63.47 శాతం ఉంటే ఏప్రిల్ 18 నాటికి ఇది 46.92 శాతానికి పడిపోయింది. పాపులారిటీ బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్ తో ఫిబ్రవరి 26న పెరిగిన మాట నిజమే కాని, ఆతర్వాత పాపులారిటీ క్రమంగా తగ్గడం కనిపించింది.

అయితే, రాహుల్ గాంధీ అంటే ఇష్ట పడే వారి సంఖ్య పెద్దగా పెరగడం లేదు. ఏప్రిల్ 18న ఆయన నెట్ శాటిస్ పాక్షన్ లెవెన్ ( సంతృప్తి వ్యక్తం చేసింది) 6.82 శాతమే. ఆయన అసంతృప్తి కనబరచింది కేవలం 25.78 శాతమే. సంతృప్తి చెందిన వారి సంఖ్య 40.64 శాతం. ఆయన మీద మొత్తం సంతృప్తి 10 పాయంట్ల లోపలే ఉంది. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి దాకా ఇదేం మెరుగపడలేదు.

తెలుగురాజ్యం ప్రత్యేకం

విజయ్ ఆంటోనీ ‘కిల్లర్’ ట్రైలర్ రివ్యూ!

  ‘బిచ్చగాడు’ విజయ్ ఆంటోనీ ‘కిల్లర్’ ట్రైలర్ విడుదలయ్యింది. తమిళంలో ‘కలైగరన్’ (హంతకుడు) గా నిర్మించి తెలుగులోకి డబ్ చేసిన ‘కిల్లర్’ కి ఆండ్రూ లూయిస్దర్శకత్వం వహించాడు. ఇతను 2012 లో కొత్త వాళ్లతో...

బాబు గారి ‘Is It not వివక్షత’ కి ఈసీ కౌంటర్?

చంద్ర బాబు గారు ఎలక్షన్ కమిషన్ ని కలిసిన తర్వాత మాట్లాడుతూ పోలింగ్ జరిగిన 30 రోజుల తర్వాత ఎలా రీపోలింగ్ నిర్వహిస్తారని , is this not వివక్షత అంటూ ప్రశ్నించారు....

‘ఎబిసిడి’ రివ్యూ – చిన్న మహర్షి అవుదామనుకుంటే…

ఐదు సినిమాల అల్లుశిరీష్ యువహీరోగా నిలదొక్కుకోవడానికి స్ట్రగుల్ చేస్తున్నాడు. ఆరో సినిమాగా నాలుగక్షరాల ‘ఎబిసిడి’ కొచ్చాడు. రీమేక్ తో, కొత్త దర్శకుడితో ఒక ప్రయోగం చేస్తున్నట్టు చెప్పాడు. అట్టహాసంగా 600 పై చిలుకు...

అత్యంత ప్రజాధారణ

తాజా వార్తలు

‘సీత’వివాదం: తేజ క్షమాపణ చెప్పాల్సిందే,లేదా కేసు

వివాదం లేనిదే పెద్ద సినిమా ఉండదా అనే విధంగా ప్రతీ సారి ఏదో వివాదం చెలరేగుతూనే ఉంది. తాజాగా తేజ దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా.. కాజల్ అగర్వాల్ టైటిల్ పాత్రలో నటించిన ‘సీత’...

‘టిక్‌ టాక్‌’ టాప్ సెలబ్రిటీని దారుణంగా చంపేసారు

ఇండియాలో పాపులర్ అయిన టిక్ టాక్ యాప్‌‌లో లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న మోహిత్ మోర్ అనే 24ఏళ్ల యువకుడు హత్యకు గురవ్వడం ఢిల్లీలో సంచలనంగా మారింది. ముగ్గురు గుర్తు తెలియని...

‘జబర్దస్థ్’ లో సడెన్ ట్విస్ట్… సీన్ లోకి సీనియర్ కమిడియన్

తెలుగు టీవీ రంగంలో బాగా పాపులర్ అయిన కామెడీ షో 'జబర్దస్థ్' అనేది ఎవరూ కాదనిలేని సత్యం. ఆ పోగ్రాం సక్సెస్ అవటంతో ఎక్స్ ట్రా జబర్ధస్త్ కూడా మొదలు పెట్టారు. అదీ...

న్యూడ్ ఫొటోలు పంపి షాక్ ఇచ్చిన సింగర్ చిన్మయి

గత కొంతకాలంగా చిన్మయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ముఖ్యగా మీటూ అంటూ తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ సంఘటనను వెలుగులోకి తెచ్చింది. అందులో భాగంగా ప్రముఖ తమిళ పాటల...

బాబూ బెల్లంకొండ ఏంటీ కామెడీ,నవ్వుకుంటున్నారు

బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ అనేది పడలేదు. అయితే తనకు హిందీలో పెద్ద మార్కెట్ ఉందని అంటున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. తన తాజా చిత్రం సీత ప్రమోషన్ లో...

అదనపు బలగాలపైనా మండిపోవటమేనా ?

కౌంటింగ్ సందర్భంగా గురువారం రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో కేంద్ర ఎన్నికల కమీషన్ అదనపు బలగాలను మోహరించింది. అదనపు బలగాలను మోహరించటంపైన కూడా చంద్రబాబునాయుడు మండిపోతున్నారు. ఎలక్షన్ కమీషన్ చేసే ప్రతీ పనినీ...

జపాన్ లో రానా తుఫాన్

అవును ..ఇప్పుడు జపాన్ లో దగ్గపాటి రానా సినిమాల తుఫాను వస్తోంది అక్కడ వరస పెట్టి ఆయన సినమాలు అన్నీ రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా బాహుబ‌లి ఫ్రాంచైజ్‌లో వ‌చ్చిన చిత్రాలు జపాన్‌లో విడుద‌ల...

వెయ్యి కోట్లకు చేరుకున్న బెట్టింగులు ?

రాష్ట్రంలో బెట్టింగుల జోరుతో మారు మోగిపోతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే పందెం రాయళ్ళు బరిలోకి దిగినా తర్వాత మెల్లిగా ఊపు తగ్గిపోయింది. పోలింగ్ ముగిసిన రోజు నుండి దాదాపు పది రోజులు బెట్టింగ్...

ఓడిపోతే….అందుకే సాకులు వెతుక్కుంటున్నారా ?

చూడబోతే  అలాగే ఉంది చంద్రబాబునాయుడు వ్యవహారం.   పదే పదే ఈవిఎంలుని వివి ప్యాట్లని ఒకటే దేశవ్యాప్తంగా చంద్రబాబు చేస్తున్న గోల చూస్తుంటే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు వాదనను కోర్టులు కొట్టేస్తున్న మళ్ళీ...

ఈ మంత్రి గెలుపు కష్టమేనా ?

చంద్రబాబునాయుడు క్యిబినెట్ లో మంత్రులందరూ రెండోసారి పోటీ చేశారు. అయితే వీరిలో ఎంతమంది గెలుస్తారనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. సరే మిగిలిన మంత్రుల సంగతి పక్కన పెడితే ఒక మంత్రి గెలుపోటముల విషయంలో మాత్రం...
 Nate Gerry Jersey