సాధారణంగా ఇద్దరు వ్యక్తులు రిలేషన్ లో ఉన్నారంటే వారు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వివిధ రూపాలలో తెలియజేస్తూ ఉంటారు.
అయితే కొందరు మాత్రం ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారంటే ఆ వ్యక్తి నుంచి ప్రేమను ఆశించకుండా మరేదో ఆశించి వారితో రిలేషన్ లో ఉంటారు.
ఇలా నిజమైన ప్రేమను చూపిస్తూ మనతో రిలేషన్ లో ఉండని వారు వారు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలేనని వారు
మన నుంచి ప్రేమను కాకుండా ఇంకేదో ఆశిస్తున్నారని ఇట్టే గుర్తించవచ్చు. మరి ఆ మాటలు ఏంటో చూద్దాం..చాలామంది రిలేషన్ లో ఉన్న వారు ఎక్కువగా
తమ జీవిత భాగస్వామికి ఐ లవ్ యు చెప్పడమే కాకుండా అన్నిటికన్నా నాకు నువ్వే ముఖ్యం నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అంటూ పదే పదే చెబుతున్నారు
అంటే వారు చెప్పే మాట అబద్ధం. ప్రేమలో ఉన్నవారు మాటిమాటికి ప్రేమలో ఉన్నానని ఎవరికి చెప్పకోరు.
ఇక ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు పొగుడుకుంటూ ఉన్నారు అంటే వారి ప్రేమ అబద్ధం. ప్రేమలో ఉన్న వారు ఎప్పుడూ కూడా ఒకరిపై మరొకరు పొగడ్తలు చెప్పుకోరు.
రిలేషన్లో ఉన్నవారైనా భార్య భర్తలైన కొన్ని రకాల కారణాలతో డబ్బు ఖర్చు చేయకూడదని భావిస్తుంటారు. ఇలా మాటిమాటికి తన దగ్గర డబ్బులు ఏమాత్రం లేవని చెబుతూ ఉంటారు
ఇలా చెబుతున్నారు అంటే వారు చెప్పే మాట పూర్తిగా అబద్ధమని గ్రహించాలి. ఒక వ్యక్తిని చాలా ఇష్టంగా ప్రాణంగా ప్రేమిస్తున్నప్పుడు వారి ఎక్స్ గురించి పొరపాటున కూడా మాట్లాడరు
కానీ నేను ప్రాణంగా ప్రేమించిన నా ప్రియుడు లేదా ప్రియురాలిని మర్చిపోయాను అంటూ మీ దగ్గర కనుక చెబితే వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని మోసం చేస్తున్నారని గ్రహించాలి.
తరచూ ఇలాంటి మాటలు చెప్పే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది.