సాధారణంగా మనం తమలపాకులను ఇంట్లో ఏదైనా శుభకార్యాల నిమిత్తం పూజా కార్యక్రమాలు నిమిత్తం ఉపయోగిస్తాము.
అయితే తమలపాకులు ఇలా పూజా కార్యక్రమాలకు తప్ప ఎక్కడ ప్రధానతలేదని భావించడం పూర్తిగా మన అపోహ మాత్రమే అని చెప్పాలి.
అయితే తమలపాకులో మన ఆరోగ్యాన్ని సంరక్షించే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు.
తమలపాకులో ఉన్న ఔషధ గుణాలను గ్రహించిన మన పూర్వీకులు వివాహం, విందు కార్యక్రమాల్లో భోజనం చేసిన వెంటనే తమలపాకు తాంబూలాన్ని ఇవ్వడం సాంప్రదాయంగా పెట్టారని చెప్పవచ్చు.
తమలపాకు వల్ల ఉపయోగాలు వాటిలో ఉన్న పోషక విలువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తమలపాకు రసం మిర్యాల పొడితో కలిపి రోజుకు రెండు టీ స్పూన్లు తీసుకుంటే
ఇందులో ఉండే విటమిన్ సి ,యాంటీ వైరస్ ,బ్యాక్టీరియల్ గుణాలు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చు.
అలాగే గొంతు నొప్పిగా ఉన్నప్పుడు తమలపాకు కషాయాన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
తరచూ తలనొప్పితో బాధపడేవారు తమలపాకు రసాన్ని తీసి ముక్కులో వేసుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
తమలపాకు మంచి యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల త్వరగా వృద్ధాప్యపు ఛాయలు దరి చేరవు. తమలపాకులో చెవికాల్ అనే పదార్థం ఉంటుంది.
ఇది బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి.
తమలపాకులో పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల మనం తీసుకున్న ఆహార పదార్థాలు తేలికగా జీర్ణం కావడానికి దోహదపడతాయి
అందుకే పెద్ద వాళ్ళు భోజనం చేసిన తర్వాత తమలపాకులను ఇవ్వడం జరుగుతుంది.
ఆరోగ్యానికి మంచిది కదా అని అవసరానికి మించి తమలపాకులను తినడం వల్ల కొన్ని ప్రమాదాలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు.