నాలాంటి బాధ నువ్వు అనుభవించకూడదు… సమంత ఎమోషనల్ పోస్ట్!

 వెండితెర నటిగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా మయో సైటీసిస్ వ్యాధితో బాధపడుతూ తాను కమిట్ అయిన సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే.

 అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత శాకుంతలం సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా సమంత పాల్గొన్నారు.

 అయితే ఈ కార్యక్రమంలో సమంత పాల్గొన్నటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 ఇలా చాలా కాలం తరువాత తమ అభిమాన నటిని చూడటంతో సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేయగా మరికొందరు ఆమె అందం గురించి ట్రోల్ చేశారు.

 ఈ క్రమంలోనే ఒక నెటిజన్ సమంత అందం గురించి స్పందిస్తూ… సమంత పరిస్థితి చూస్తుంటే చాలా జాలిగా ఉంది.

 మయోసైటిస్ వ్యాధి కారణంగా ఈమె అందం పూర్తిగా తగ్గిపోయిందని విడాకుల తర్వాత సమంత కెరియర్ చాలా బాగుంటుంది అనుకుంటే

 మయోసైటిస్ తన కెరియర్ పై దెబ్బకొట్టి తనని బలహీనురాలను చేసింది అంటూ కామెంట్ చేశారు.

  అయితే ఈ కామెంట్లపై ఎంతో మంది సమంత అభిమానులు స్పందిస్తూ తమదైన శైలిలో రివర్స్ కౌంటర్ ఇవ్వగా సమంత కూడా ఈ కామెంట్ పై స్పందించారు.

 ఈ సందర్భంగా నేటిజన్ చేసిన కామెంట్ పై సమంత స్పందిస్తూ నాలాగా మీరు కొన్ని మాసాలు చికిత్స తీసుకొనే పరిస్థితి మీకు రాకూడదని నేను కోరుకుంటున్నాను

 అలాగే మీరు మరింత అందంగా కనిపించడం కోసం నా ప్రేమను కూడా పంపిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత తనదైన శైలిలో తనకు కౌంటర్ ఇచ్చారు.

 దీంతో పలువురు సెలబ్రిటీలు కూడా సమంతకు మద్దతుగా నిలబడి తనకు ధైర్యం చెబుతున్నారు.