బాలయ్యను అభిమానిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే కొడుకు.. వాళ్లు సైతం షాకయ్యేలా?

  ఏపీ సీఎం వైఎస్ జగన్ స్టార్ హీరో బాలకృష్ణకు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. కడప జిల్లా బాలయ్య అభిమానుల సంఘానికి జగన్ ప్రెసిడెంట్ గా పని చేశారు.

 అయితే జగన్ రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత మాత్రం బాలయ్యపై అభిమానం చూపలేదు. అయితే బాలయ్య సినీ హీరో కావడంతో పాటు టీడీపీ ఎమ్మెల్యే అనే సంగతి తెలిసిందే.

  వైసీపీపై విమర్శించే అవకాశం వస్తే బాలయ్య మాత్రం అస్సలు వెనుకాడరు.

 అయితే వైసీపీలో కూడా బాలయ్యను అభిమానించే వాళ్లు ఉంటారనే సంగతి తెలిసిందే.

 ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే తనయుడు వీర ధరణి ధర్ రెడ్డి తాజాగా ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా అందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది.

 ఒకవైపు బాలయ్య ఉండగా మరోవైపు వీర ధరణి ధర్ రెడ్డి ఉన్నారు. రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే అంటూ ఆయన ఫ్లెక్సీలో పేర్కొనడం గమనార్హం.

 అయితే వైసీపీ ఎమ్మెల్యే కొడుకు బాలకృష్ణకు అనుకూలంగా పబ్లిక్ గా ఈ విధంగా ప్రచారం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

 ఈ కామెంట్ల గురించి ఎమ్మెల్యే కొడుకు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఈ తరహా ఘటనల వల్ల వైసీపీ పరువు పోతుందని కొంతమంది సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 వైసీపీ నేతలు ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకుంటే మంచిదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు పరోక్షంగా పార్టీకి హాని చేస్తాయి.

 వైసీపీ పార్టీ పరంగా వ్యతిరేకులకు అనుకూలంగా పోస్ట్ లు చేయడం సరికాదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.