మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం ఈనాటిది కాదు.
కానీ, ఆయన మాత్రం తాను రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. కానీ, ఆయన మాత్రం తాను రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు.
అయినాగానీ, ఆయన రాజకీయాల్లోకి మళ్ళీ వస్తారంటూ ప్రచారమైతే కొనసాగుతూనే వుంది.
రాజకీయాల్ని చిరంజీవి వదిలించుకున్నా, ఆయన్ని రాజకీయం వదిలించుకోవడంలేదు. మీడియా ఏదో ఒక రకంగా చిరంజీవి పేరుని రాజకీయాల్లోకి లాగుతూనే వుంది.
ఈ క్రమంలోనే విశాఖ నుంచి చిరంజీవి జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ మీడియాలో కొత్తగా ఊహాగానాలు షురూ అయ్యాయ్.
అయితే, ఈ గాసిప్స్ విషయంలో చిరంజీవి ఒకింత అసహనంతో వున్నారట. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం విశాఖ వెళ్ళిన చిరంజీవి,
అక్కడే ఆ వేదికపైనుంచే తాను విశాఖ వాసిని అవుతానంటూ వ్యాఖ్యానించారు. విశాఖలో స్థలం కొనుక్కున్నాననీ, ఇల్లు కట్టుకుంటాననీ చెప్పారు చిరంజీవి.
దాంతో, చిరంజీవి విశాఖ నుంచి పోటీ చేస్తారంటూ గాసిప్స్ షురూ అయిపోయాయ్. కాగా, ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలోనే,
‘నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు’ అంటూ చిరంజీవి చూచాయిగా చెప్పేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి భేటీ అవుతారంటూ గాసిప్స్ రావడం.. జనసేన నుంచి చిరంజీవి పోటీ చేస్తారంటూ కొత్తగా గాసిప్స్ పుట్టడం..
ఇవన్నీ చిరంజీవి పేరుతో ఆడుతున్న పబ్లిసిటీ డ్రామాలంతేనన్నది మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న సమాచారం తాలూకు సారాంశం.