అఖిల్ ‘ఏజెంట్’ విషయంలో ఇంత హైడ్రామా ఎందుకు.?

 2022లోనే విడుదలవ్వాల్సిన ‘ఏజెంట్’ సినిమా, 2023లో అయినా విడుదలవుతుందా.? లేదా.?

 అన్న అనుమానాలు కలుగుతున్నాయి అక్కినేని అభిమానులకి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన

 ‘ఏజెంట్’ సినిమా మీద అప్పట్లో విడుదలైన ప్రోమో కారణంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 అంతే, ఆ తర్వాత మళ్ళీ బజ్ పూర్తిగా చప్పబడిపోయింది. ఇక్కడ నిందించాల్సింది చిత్ర దర్శక నిర్మాతల్నే.

 అసలు సినిమా స్టేటస్ ఏంటన్నది బయటకు రావడంలేదు. రీ-షూట్లు జరుగుతున్నాయన్న గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి.

 వాటినీ చిత్ర యూనిట్ ఖండించడంలేదాయె. అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ హీరో సినిమాకి ఇలాగేనా చేసేది.?

 ఏప్రిల్‌తో సినిమా రిలీజ్ వుండొచ్చన్నది ఓ వాదన. కానీ, అది కుదిరేలా కనిపించడంలేదు.

 అసలు ‘ఏజెంట్’ విషయంలో ఇంత హైడ్రామా ఎందుకు.? సినిమా స్క్రాప్ అయిపోతుందన్న ప్రచారానికి కారణమెవరు.?