కళ్యాణ్ రామ్ “అమిగోస్” స్ట్రీమింగ్ ఎందులో? ఎప్పుడు అంటే.!

ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ సినిమాల్లో నందమూరి వారి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించిన క్రేజీ థ్రిల్లర్ చిత్రం “అమిగోస్” కూడా ఒకటి.

అయితే ఈ మధ్య కాలంలో కాస్తో కూస్తో మంచి అంచనాలతో వచ్చిన సినిమా ఇది అని చెప్పాలి.

అయితే బింబిసార సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడం అది కూడా సక్సెస్ ఫుల్

నిర్మాణ సంస్థ మైత్రి మేకర్స్ నుంచి వచ్చిన సినిమా కావడంతో దీనికి కూడా మంచి సక్సెస్ వస్తుందని అంతా అనుకుంటున్నారు.

ఇక ఆల్రెడీ యావరేజ్ టాక్ సినిమాకి రాగా సినిమాకి వసూళ్లు ఎలా వస్తాయి అనేది ఆసక్తిగా మారింది.

కాగా ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ అయితే వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ అన్ని భాషల హక్కులని ఇది కొనుగోలు చేశారు.

అయితే ఈ సినిమా సుమారు నాలుగు నుంచి 5 వారాల గ్యాప్ లోనే నెట్ ఫ్లిక్స్ అయితే వచ్చేసే అవకాశం ఉన్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.

సినిమా సరిగ్గా ఆడనట్టు అయితే కేవలం నాలుగు వారాల్లోనే వచ్చేస్తుందని కూడా చెప్పొచ్చు.

ఇక ఈ సినిమాకి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించగా జిబ్రాన్ సంగీతం సమకూర్చాడు. అలాగే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రల్లో నటించాడు.