ఏపీ సీఎం వైఎస్ జగన్ టీడీపీపై విమర్శలు చేసే ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు.
కందుకూరు ఘటన గురించి తాజాగా జగన్ నర్సీపట్నంలో షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబును చూస్తే గుర్తొచ్చేవి రెండేనని ఒకటి వెన్నుపోటు కాగా రెండు మోసాలని జగన్ అన్నారు. రాజకీయం అంటే డ్రామాలు, డ్రోన్ షాట్లు కాదని జగన్ చెప్పుకొచ్చారు.
చంద్రబాబును చూసి ప్రజలు ఇదేం ఖర్మరా అనుకుంటున్నారని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు దత్త తండ్రి అని పవన్ దత్త పుత్రుడు అని జగన్ సెటైర్లు వేశారు.
ఈ భార్య కాకపోతే ఆ భార్య అని పవన్ భావిస్తారని జగన్ కామెంట్లు చేయడం గమనార్హం. జగన్ సభలకు కూడా వేల సంఖ్యలో జనం హాజరవుతున్నా ఎవరికీ ఎక్కడా ఇబ్బంది కలగకుందా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.
జగన్ సర్కార్ ను చూసి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా మారతారో లేదో చూడాల్సి ఉంది.
చంద్రబాబు ఇదే తరహా పొరపాట్లు చేస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితే టీడీపీకి కూడా ఎదురవుతుందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జగన్ ను అభివృద్ధి గురించి ప్రశ్నించే చంద్రబాబు టీడీపీ హయాంలో ఏపీలో జరిగిన అభివృద్ధి ఏంటో చెబితే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
73 ఏళ్ల చంద్రబాబు ప్రజల కంటే సొంత పార్టీ నేతలకే ఎంతో మంచి చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు కోట్లకు పడగలెత్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
జగన్ లా గొప్పగా పాలించడం చంద్రబాబుకు ఎప్పటికీ సాధ్యం కాదని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.