ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి అలాగే మాస్ మహారాజ్ రవితేజ లు ఈ చిత్రంలో నటించగా యంగ్ దర్శకుడు బాబీ అయితే తెరకెక్కించారు.
మరి ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొల్పుకోగా లేటెస్ట్ గా అయితే చిత్ర యూనిట్ సినిమా నుంచి అవైటెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సహా ట్రైలర్ లపై క్రేజీ అప్డేట్ ని అయితే ఇచ్చేసారు.
అయితే మొదట సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేస్తారని టాక్ వచ్చి వచ్చింది కానీ ఇప్పుడు అయితే రెండిటికి కూడా సెపరేట్ డేట్స్ ని చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు.
మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అనుకున్నట్టే జనవరి 8నే లాక్ చేయగా ట్రైలర్ ని అయితే ముందు రోజే అంటే జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసి ఓ పవర్ ఫుల్ పోస్టర్ తో మేకర్స్ రిలీజ్ చేశారు.
మరి ఓ అదిరిపోయే ఏక్షన్ సీక్వెన్స్ నుంచి రిలీజ్ చేసిన ఈ పోస్టర్ మరిన్ని అంచనాలు పెంచేలా ఉందని చెప్పాలి.
ఇక ఈ మెగా మాస్ ట్రైలర్ అయితే ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ జనవరి 7 వరకు ఆగాల్సిందే.
ఇప్పటికే పాటలు టీజర్ లు మంచి అంచనాలు రేపాయి మరియు ఈ రాబోయే ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.