“కాంతారా 2” రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అంటే.!

గత ఏడాదిలో ఒక్క తెలుగు సినిమా దగ్గరే కాకుండా టోటల్ పాన్ ఇండియా సినిమా దగ్గర కూడా సూపర్ హిట్ గా నిలిచిన

లేటెస్ట్ చిత్రాల్లో శాండిల్ వుడ్ సెన్సేషనల్ సినిమా “కాంతారా” కూడా ఒకటి,

హీరో రిషబ్ శెట్టి నటించి తానే దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు కన్నడ హిందీ భాషల్లో మైండ్ బ్లాకింగ్ హిట్ అయ్యి ఏకంగా 400 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది.

అయితే ఈ చిత్రాన్ని కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే వారే నిర్మాణం వహించగా వారి ఖాతాలో మరిమరో విజయాన్ని సొంతం చేసుకున్నారు.

అయితే ఈ సంస్థ నుంచి సినిమాల్లో కేజీఎఫ్ ఎలా అయితే పార్టులుగా వచ్చిందో నెక్స్ట్ కాంతారా కూడా ఓ ఫ్రాంచైజ్ గా కొనసాగిస్తామని వారు తెలిపారు.

ఇక ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో కాంతారా పార్ట్ 2 పై అప్పుడే రిలీజ్ కోసం ఇంట్రెస్టింగ్ సమాచారం బయటకి వచ్చింది.

మరి దీనితో అయితే ఈ నెక్స్ట్ సినిమాని చిత్ర యూనిట్ వచ్చే ఏడాది అంటే 2024 లో వేసవి కానుకగా రిలీజ్ చేయనున్నారట.

అయితే ఇంకా రిషబ్ సినిమా సీక్వెల్ ని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అనేది ఇంకా చెప్పలేదు.

కొన్నాళ్ల కితమే సినిమా అయితే కొంచెం సమయం తీసుకొనే స్టార్ట్ చేస్తానని చెప్పాడు. మరి ఇది స్టార్ట్ అయ్యి  అప్పటికి కంప్లీట్ అవుతుందో లేదో చూడాలి.

మరి మొదటి సినిమాకి అయితే అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది.