మరో కమర్షియల్ దర్శకుడితో గోపి.. ఏమవుతుందో?

ఈ మధ్యకాలంలో ఒక భాష హీరోతో మరో భాషకు చెందిన డైరెక్టర్లు సినిమాలు చేస్తున్న దాఖలాలు ఎక్కువయ్యాయి.

 ఎక్కువగా తెలుగు హీరోలతో తమిళ కన్నడ దర్శకులు సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ప్రశాంత్ నీల్, లింగుస్వామి, వెంకట ప్రభు వంటి వాళ్లు సినిమాలు చేస్తున్నారు.

 ఇప్పుడు మరో తెలుగు హీరోతో కన్నడ డైరెక్టర్ సినిమా చేయడం ఆసక్తికరంగా మారింది. హీరో గోపీచంద్ కన్నడ డైరెక్టర్ హర్ష సినిమా చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

 హర్ష డైరెక్షన్లో గోపీచంద్ 31వ సినిమా తెరకెక్కబోతోంది. గోపీచంద్ కెరీయర్లో 31వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈరోజు ఘనంగా జరిగాయి.

 కన్నడలో అనేక బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన హర్ష ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. భారీ బడ్జెట్లో తెరకెక్కించబోతున్న

 ఈ సినిమాని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధమోహన్ నిర్మిస్తున్నారు. ఇక భారీ బడ్జెట్ తో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కపోతున్న

 ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయని అలాగే మరిన్ని ఇతర ఎలిమెంట్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్సుర్ సంగీతం అందిస్తున్న

 ఈ సినిమాకి జె స్వామి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే ఇతర టాప్ టెక్నీషియన్స్ కూడా సినిమాలో భాగమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

 ఇక ఈ సినిమాలో నటీనట్లు వివరాలు కూడా ఇంకా వెల్లడించాల్సి ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన కూడా వచ్చే అవకాశం కల్పిస్తోంది.

 గతంలో రాధా మోహన్ గోపీచంద్ కాంబినేషన్లో పలు సినిమాలు వచ్చాయి. కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు మరోసారి పూర్తిస్థాయి కమర్షియల్ డైరెక్టర్తో

 గోపీచంద్ సినిమా చేస్తున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం గోపిచంద్ రామబాణం సినిమా చేస్తున్నాడు.

 ఈ మధ్యే టైటిల్ రిలీజ్ చేశారు. ఆ సినిమా త్వరలోనే విడుదలకు రంగం అవుతుంది. చూడాలి గోపిచంద్ లైన్లోకి వస్తాడో లేడో అనేది.