జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆయన స్నేహితుడు అలీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఏమవుతుంది.?
ఇప్పుడున్న ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే అలీ గెలిచేందుకు అవకాశాలు సుస్పష్టమే. కానీ, అలీ అంత రిస్క్ చేస్తాడా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
మీడియా ఎగబడి మరీ, అడగడంతో.. ‘జగన్ ఆదేశిస్తే, పోటీకి సిద్ధం..’ అని అలీ మొహమాటంగా చెప్పాడు తప్ప, ఆయన మాటల్లో సీరియస్‌నెస్ అస్సలు కనిపించలేదు.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అలీ రాజ్యసభ సభ్యత్వం కోసం ఎదురుచూస్తున్నాడు. అది కుదరకపోతే, ఎమ్మెల్సీగా ఛాన్స్ కోరుతున్నాడట.
అంతే తప్ప, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అలీ అస్సలేమాత్రం ఇష్టం చూపడంలేదని తెలుస్తోంది. ఎందుకిలా.? అంటే, రాజకీయాలు చాలా ఖరీదైపోయాయ్.
పైగా, కోట్లు ఖర్చు చేసి.. ఎమ్మెల్యే పదవి తెచ్చుకోవడం వల్ల ఉపయోగం లేదన్న భావనలో అలీ వున్నాడనే ప్రచారమూ జరుగుతోంది.
ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ అయినా గట్టిగానే ఖర్చు చేయాలి ఈ రోజుల్లో. రాజకీయాలు అంత ఖరీదైపోయాయ్. అయితే, ఎమ్మెల్యేలు.. ఎంపీలు (లోక్‌సభ) పరిస్థితి వేరు.
ఎమ్మల్సీ.. రాజ్యసభ అంటే ఆ లెక్క వేరు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు కొంత వివాదాలకు దూరంగా వుంటారు. అలీ ఆలోచన కూడా.
2014లోనే అలీ అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నా అది కురదలేదు. టీడీపీ అప్పట్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు.
2019లోనూ టీడీపీ నుంచి టిక్కెట్ ఆశించి, అది దొరక్క వైసీపీలో చేరితే, ఇక్కడా చుక్కెదురయ్యింది. ఇప్పటికే అలీకి ఈ విషయమై వైరాగ్యం వచ్చేసి వుండాలి.