వరల్డ్ సినిమాని షేక్ చేస్తున్న జక్కన్నతో ‘అవతార్’ దర్శకుడు చెప్పిన మాట.!

 వరల్డ్ సినిమా దగ్గర ఇప్పుడు తెలుగు సినిమా ముమ్మాటికీ దర్శకుడు రాజమౌళి వలనే ఇంకో స్థాయికి వెళ్ళింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 ఒకప్పుడు హిందీ మరియు తమిళ్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రూల్ చేస్తున్న సమయంలో చిన్న చిన్నగా భారీ సినిమాలు చేస్తూ నెక్స్ట్ లెవెల్ కి రాజమౌళి తన సినిమాని విస్తరించాడు.

 బాహుబలి సినిమాల్తో అయితే వరల్డ్ సినిమాకి గేట్ లు తెరవగా నెక్స్ట్ అయితే లేటెస్ట్ భారీ హిట్ ట్రిపుల్ ఆర్(RRR) తో వరల్డ్ సినిమా దగ్గర ఇండియా సినిమా అంటే ఏంటో ప్రూవ్ చేసేలా చేసింది.

 ఇక వరల్డ్ సినిమా అంటే మొదటగా గుర్తుకొచ్చే పేరు అవతార్, టెర్మినేటర్, టైటానిక్ లాంటి ఎన్నో భారీ సినిమాలు చేసి రికార్డులు తన గుప్పెట్లో పెట్టుకున్న దర్శకుడు జేమ్స్ కామెరాన్

 రాజమౌళిని అలాగే తన ఆర్ ఆర్ ఆర్ సినిమాని కొనియాడడం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. కొన్ని రోజులు కితం వీరి కలిసినపుడు ఓ వీడియో రాగా ఇప్పుడు ఫుల్ వీడియో సినీ వర్గాల్లో బయటకి వచ్చింది.

 మరి ఈ లేటెస్ట్ వీడియోలో ఈ వరల్డ్ డైరెక్టర్ రాజమౌళితో మాట్లాడుతూ ఫైర్, వాటర్ అనే రెండు పవర్ ఫుల్ ఎలిమెంట్స్ ని పట్టుకొని హీరోస్ పై ప్రెజెంట్ చేయడం చాలా పవర్ ఫుల్ గా అనిపించింది అని ఎమోషన్స్ చాలా బాగున్నాయని ప్రశంసలు కురిపించారు.

 అలాగే పక్కనే ఉన్న తన భార్య జేమ్స్ ఈ సినిమాని రెండు సార్లు చూసారు చూస్తున్నంతసేపు తనని డిస్టర్బ్ చెయ్యొద్దు అని కసిరేసేవారని ఆమె చెప్పింది.

 ఇక లాస్ట్ లో జేమ్స్ కామెరాన్ రాజమౌళి చెవిలో మీరు గనుక హాలీవుడ్ లో సినిమా చేయాలి అనుకుంటే చెప్పండి మనం కూర్చొని మాట్లాడుదాం అంటూ చెప్పిన మాట ఇపుడు వరల్డ్ సినిమాని షేక్ చేసి పారేసింది.

 ఈ మాట కోసం ఇప్పుడు సినీ లోకం అంతా కూడా తీవ్ర చర్చగా మార్చేసింది. దీనితో తెలుగు ఆడియెన్స్ ఈ విషయంలో ఎంతో గర్వం వ్యక్తం చేస్తున్నారు.