మంత్రి రోజాని డైమండ్ రాణి అనడం వెనుక ఆంతర్యమేంటి.?

 అత్యంత దారుణమైన, జుగుప్సాకరమైన విమర్శ అనొచ్చా.? ఇంకేమైనా అనాలా.? జనసేన అధినేత,

  సినీ నటుడు పవన్ కళ్యాణ్ ‘యువశక్తి’ కార్యక్రమంలో మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది.

 ఓ మంత్రిని, పైగా మహిళా మంత్రిని ‘డైమండ్ రాణి’ అని పవన్ కళ్యాణ్ ఎందుకు అన్నారు.?

 ఏం, ఎందుకు అనకూడదు.! పవన్ కళ్యాణ్‌ని రోజా నానా రకాలుగా విమర్శిస్తున్నారు గనుక, పవన్ కళ్యాణ్ కౌంటర్ ఎటాక్ చేశారని సమర్థించుకోవచ్చుగాక జనసేన క్యాడర్.

 కానీ, ఇప్పుడు ఆ ‘డైమండ్ రాణి’ వెనుక అర్థమేంటో పవన్ కళ్యాణ్ చెప్పకపోతే, దానికి పెడార్ధాలు తీసి.. వ్యవహారాన్ని మరింత పెంట చేసేస్తారు నెటిజన్లు.

 ముఖ్యమంత్రిని పట్టుకుని 6093 నెంబర్ ఖైదీ అనీ, ముఖ్యమంత్రికి కాదు.. 6093కి పోలీసులు సెల్యూట్ చేస్తున్నారంటూ డీజీపీ పేరుని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం అత్యంత అభ్యంతకరమైన విషయం.

 ‘నేను రెండు సార్లు గెలిచాను.. నువ్వు రెండు చోట్ల ఓడిపోయావు.. నువ్వు కూడా నన్ను విమర్శించడమేనా.?

 థూ..’ అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి రోజా సోషల్ మీడియా వేదికగా సమాధానమిచ్చారు.

 మరోపక్క, మంత్రి అంబటి రాంబాబు అయితే ‘నేను సంబరాల రాంబాబు అయితే నువ్వు కళ్యాణాల పవన్‌..’ అంటూ ఎద్దేవా చేశారు.

 వైసీపీ నుంచి పేర్ని నాని సహా పలువురు వైసీపీ నేతలు మీడియా ముందుకొస్తున్నారు. జనసేనాని మీద విమర్శలు చేస్తున్నారు.

 ‘నా మీద ప్యాకేజీ విమర్శలు చేసేవారెవరైనా నా ముందుకు వచ్చి ఆ మాటలు అనండి.. జనసైనికుల చెప్పుతో కొడతా..’

 అని పవన్ ‘యువశక్తి’ వేదిక ద్వారా సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. మొత్తమ్మీద, ఈ వ్యవహారం పెను రాజకీయ దుమారానికి కారణమవుతోంది.

 యువశక్తి సమావేశంలో.. పవన్ కళ్యాణ్ ఏం సందేశం ఇచ్చారు.? రెచ్చగొట్టడం తప్ప పవన్ కళ్యాణ్ చేసే రాజకీయం ఏముంది.? అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.