ఏం సెప్తిరి ఏం సెప్తిరి.. విమర్శలెందుకు నాగబాబు కోర్టును ఆశ్రయించొచ్చుగా?

 ఏపీలో కొన్ని రోజుల గ్యాప్ లో 11 మంది మృతి చెందడం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. చంద్రబాబు సభలలో చోటు చేసుకున్న ఈ ఘటనలపై

 కొన్ని అనుమానాలు ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సభలను నిర్వహించడం కరెక్ట్ కాదని భవించి ప్రభుత్వం కొత్త నిబంధనల అమలుకు సిద్ధమైంది.

 అయితే తాజాగా నాగబాబు జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 జీవో నంబర్1 గురించి నాగబాబు స్పందిస్తూ ప్రజలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని విమర్శించారు. గత ప్రభుత్వాలు కూడా ఇదే విధంగా చేసి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారా అని ఆయన ప్రశ్నించారు.

 చంద్రబాబు, పవన్ లను ఎంత ఆపితే అంత ఎదుగుతారని నాగబాబు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. జీవోను వెనక్కు తీసుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు.

 ఇది ప్రజాస్వామ్యా లేక రాచరికమా అంటూ నాగబాబు ప్రశ్నించారు. అయితే నాగబాబు విమర్శలు చేయాల్సిన అవసరం ఏముందని జగన్ సర్కార్ చేసింది తప్పని భావిస్తే

 కోర్టును ఆశ్రయిస్తే సరిపోతుందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కోర్టులో ఎవరికి అనుకూలంగా తీర్పు వస్తుందో చెప్పడం కష్టం.

 అయితే ప్రజల ప్రాణాలు పోతుంటే కోర్టు సైతం సమర్థించదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ హైకోర్టు రాబోయే రోజుల్లో ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

 గుంటూరు ఘటనలో కుట్ర కోణం ఉంటే ప్రూవ్ చేసి టీడీపీ, జనసేన విమర్శలు చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.