గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఎన్నో చిత్రాల్లో తాను కెరీర్ స్టార్ట్ చేసిన మొదట్లో చేసిన సినిమా ప్రతిదీ హిట్
కాగా ఆ చిత్రాల్లో దర్శకుడు ఎస్ జె సూర్య తో చేసిన లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా “ఖుషి” కోసం తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు.
మంచి ఫ్యాక్షన్ సినిమాలు హవా నడుస్తున్న సమయంలో పవన్ లవ్ స్టోరీ తో వచ్చి అయితే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.
మరి దీనితో పవన్ కెరీర్ లో ఇది మొదటి ఇండస్ట్రీ హిట్ కాగా పవన్ ఫ్యాన్స్ లో కూడా ఈ సినిమాకి ఓ సుస్థిర స్థానం ఉంది.
ఇక ఈ సినిమా మళ్ళీ ఇన్నాళ్ళకి రీ రిలీజ్ అవుతుండగా మళ్ళీ పవన్ ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ చేశారు.
ఆల్రెడీ తెలుగు స్టేట్స్ లో భారీ మొత్తంలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం యూఎస్ మార్కెట్ లో కూడా రిలీజ్ అవుతుంది.
అయితే అక్కడ అనూహ్యంగా థియేటర్స్ వారు పవన్ సినిమాకి థియేటర్స్ ఇవ్వను అని అంటున్నారట. మరి దీనికి బలమైన కారణం లేకపోలేదు.
పవన్ గత సినిమా జల్సా రీ రిలీజ్ కి చేసిన రచ్చ థియేటర్స్ లో మిగిలిన చెత్త అంతా వారికి గుర్తు ఉందట అందుకే అనుకున్న రేంజ్ లో థియేటర్స్ ఈ చిత్రానికి యూఎస్ మార్కెట్ లో దక్కే ఛాన్స్ లేదని తెలుస్తుంది.
ఇలా మొత్తానికి అయితే పవన్ సినిమాకి థియేటర్స్ దక్కట్లేదట. ఇక ఈ సినిమాలో భూమిక చావ్లా హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు.