process-aws

 మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటివి గుండె పోటుకు కారణమా నిపుణులు ఏమంటున్నారంటే?

gneralized-anxiety-disorder-51742555_l

 ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఏదో విధమైన అనారోగ్య కారణాలతో తీవ్ర మానసిక ఒత్తిడిని అనుభవిస్తూ డిప్రెషన్ కు గురవుతున్నారు.

Alcohol-Addiction-1200x800

 ఈ సమస్య నుంచి బయటపడడానికి నిద్ర మాత్రలు, మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు బానిసై తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు

  ఎప్పుడైతే ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం దెబ్బతిని డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి సమస్యలతో బాధపడుతుంటే ఆ వ్యక్తి కచ్చితంగా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని భావించవచ్చు.

 ముఖ్యంగా డిప్రెషన్ వంటి సమస్యతో బాధపడుతుంటే గుండెపోటు,థైరాయిడ్, డయాబెటిస్, క్యాన్సర్,మరియు ఇతర ఇన్ఫెక్షన్లు కారణమై ఉంటాయి.

 ఈ విషయం తేలిక చాలామంది దీన్ని తేలిక తీసుకొని అజాగ్రత్త పాటిస్తారు దీంతో దీర్ఘకాలంలో అనేక సమస్యలు తలెత్తుతాయి.

 ముఖ్యంగా గుండె పోటు వచ్చిన వారిలో డిప్రెషన్ అనేది చాలా పెద్ద సమస్య దాంతో స్ట్రోక్ వచ్చే ముందు డిప్రెషన్ రావడాన్ని పోస్ట్ స్ట్రోక్ డిప్రెషన్ అని అంటున్నారు.

 ఈ సమస్య నుంచి బయటపడడానికి శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో మానసిక ఆరోగ్యం కూడా అంతే అవసరం. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి

 ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా కొంత శ్రమ కలిగిన నడక,వ్యాయామాలు చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.

 అలాగే మానసిక ప్రశాంతత కలిగి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మనస్సును ఎప్పుడూ ప్రశాంతంగా, మీ నియంత్రణలో ఉంచుకోవడంపై దృష్టి సారించండి.

 దానికోసం శ్వాస మీద ధ్యాస, ఆసనాలు యోగ వంటివి అలవాటు చేసుకోండి గుండె జబ్బులు మరియు శ్వాస సంబంధమైన వ్యాధి ఉన్నవారు ఇబ్బంది లేనంతవరకు మెట్లు ఎక్కడాన్ని ప్రతిరోజు పాటించవచ్చు.

 ఈత కొట్టడం ద్వారా రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది తద్వారా గుండె సంబంధిత వ్యాధులు అదుపులో ఉంటాయి. ఒకేసారి ఎక్కువసేపు నడిస్తే అలసట వచ్చి వేరే సమస్యలకు దారి తీయవచ్చు.

 కావున స్టాప్‌ అండ్‌ గో స్టైల్‌ వాకింగ్‌ చేయడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటి అలవాట్లను దినచర్యగా చేసుకుంటే మానసిక ఆందోళన డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గి సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.