సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
అందువల్ల హీరోలు హ్యాండ్సమ్ గా కనిపించడానికి హీరోయిన్లు గ్లామరస్ గా కనిపించటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కి అవకాశాలు దక్కాలంటే వారు చాలా నాజూగ్గా అందంగా ఉండాలి.
ఇలా ఉండటం కోసం ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతూ.. కష్టతరమైన వర్కౌట్లు చేయాలి. ఇలా చేస్తేనే హీరోయిన్లు బరువు ఎక్కకుండా అందంగా కనిపిస్తారు.
ఇక సినిమా ఇండస్ట్రీ నుండి దూరమైన తర్వాత చాలామంది హీరోయిన్లు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.ఇలా అలనాటి ఎంతో మంది హీరోయిన్లు సినిమాలకు దూరమైన తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.
ఇలా తెలుగు తమిళ్ కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన రవళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
శుభాకాంక్షలు, పెళ్లి సందడి సినిమాల రవళి ద్వారా హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. 2007లో నీలి కృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యింది.
భర్త, పిల్లలతో సమయం గడుపుతూ పూర్తిగా ఇంటికే పరిమితం అయిన రవళి తాజాగా తిరుపతిలో దైవదర్శనానికి వచ్చింది.
శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి వచ్చిన రవళి చూసి ఆమె అభిమానులు షాక్ అయ్యారు.
ఒకప్పుడు ఎంతో నాజూగ్గా అందంగా ఉండే రవళి సినిమాలకు దూరమైన తర్వాత చాలా బరువు పెరిగి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చిన రవళి కి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రవళి ని గుర్తు పట్టిన కొంతమంది అభిమానులు ఆమె తో సెల్ఫీలు తీసుకున్నారు.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రవళి మళ్లీ సినిమాలలో రీఎంట్రీ ఇవ్వాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.