చిన్నతనంలో ఆ వ్యసనాల వల్లే పేదరికం అనుభవించాము: అనసూయా భరద్వాజ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన అనసూయ బుల్లితెర మీద ప్రసరమైన ఎన్నో టీవీ షోస్ లో యాంకర్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇలా యాంకరింగ్ తో పాటు తన గ్లామర్ తో కూడా బుల్లితెర పేక్షకులను ఆకట్టుకొని గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందింది.

ప్రస్తుతం అనసూయ టీవీ షోలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన గ్లామర్ తో తరచూ తన అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.

యాంకర్ గా బాగా పాపులర్ అవ్వటం వల్ల అనసూయకు సినిమాలలో నటించే అవకాశాలు వరుస కడుతున్నాయి.

ఇప్పటికే రంగస్థలం, క్షణం, పుష్ప వంటి ఎన్నో సినిమాలలో వైవిద్యమైన పాత్రలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది.

ప్రస్తుతం అనసూయ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ తన వ్యక్తిగత విషయాలతో పాటు కుటుంబ విశేషాల గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఈ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ.. ఇప్పుడు యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన తాను చిన్నతనంలో చాలా కష్టాలు అనుభవించినట్లు వెల్లడించింది.

తాను చిన్నతనంలో ఉన్నప్పుడు తమకి చాలా ఆస్తులు ఉండేవని అయితే తన తండ్రికి ఉన్న ఒక వ్యసనం కారణంగా ఉన్న ఆస్తులు పోగొట్టుకొని పేదరికం అనుభవించామని వెల్లడించింది.

అనసూయ తండ్రికి గుర్రపు పందాలు అంటే చాలా ఇష్టం అని తరచూ గుర్రపు పొందాలలో పాల్గొంటూ.. అదే వ్యసనంగా మారి తమకి ఉన్న ఆస్తి మొత్తం పందెంలో పోగొట్టుకున్నారని చెప్పుకొచ్చింది.

అయితే తమని తన తండ్రి చాలా బాగా పెంచాడని.. తమకి ఏ లోటూ లేకుండా స్వతంత్రంగా పెంచాడని చెప్పుకొచ్చిం