ఈ మధ్యకాలంలో మెగా కుటుంబం నుంచి అన్ని శుభవార్తలే బయటకు వస్తున్నాయి.
రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులు వచ్చాయి.
ఇక రాంచరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారని తెలియడంతో మెగా అభిమానుల ఆనందం రెట్టింపు అయింది.
ఇక ఆచార్య సినిమా మినహా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా మంచి హిట్ కావడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా సంతోషంగా ఉన్నారు.
ఇకపోతే వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల ఈ మంచి సక్సెస్ అందుకుంది
ఈ సినిమాలో చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించిన సుస్మిత కొణిదెల తాజగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సుస్మిత సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేయడమే కాకుండా
ఉపాసన రాంచరణ్ లకు పుట్టబోయే పిల్లల గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ రామ్ చరణ్ కు కుమార్తె పుట్టిన కూతురు పుట్టిన తనకు సంతోషమేనని అయితే ఇప్పటికే ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉన్నారు.
అందుకే అబ్బాయి పుడితే బాగుంటుందని కోరికగా ఉంది అంటూ ఈ సందర్భంగా తనకు మేనల్లుడు కావాలని ఈమె తన మనసులో కోరికను బయటపెట్టింది.
ఇలా సుస్మిత తనకు మేనల్లుడే కావాలంటూ చెప్పడంతో తప్పనిసరిగా రామ్ చరణ్ కు కొడుకే పుడతారని పలువురు భావిస్తున్నారు.