“వాల్తేరు వీరయ్య” – బ్యాడ్ న్యూస్ చెప్పిన శృతి హాసన్.!

ఈ సంక్రాంతి కానుకగా ఎన్నో అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న

అవైటెడ్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి సహా మాస్ మహారాజ రవితేజ హీరోలుగా నటించిన చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి.

మరి ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరి ఈ సంక్రాంతి కానుకగా వచ్చే చిత్రాల్లో బాలయ్య చేసిన చిత్రం “వీరసింహా రెడ్డి” లో కూడా శృతి హాసన్ హీరోయిన్ గానే నటించగా

ఈ సినిమాకి గాను మొన్న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు లో జరగగా దానికి గాను శృతి కూడా హాజరయ్యింది.

అయితే ఈరోజు వైజాగ్ లో వాల్తేరు వీరయ్య గ్రాండ్ ఈవెంట్ జరగనుండగా దీని విషయంలో మాత్రం శృతి హాసన్ బ్యాడ్ న్యూస్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తాను వాల్తేరు వీరయ్య ఈవెంట్ కి రాలేకపోతున్నానని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడి చేసింది.

అయితే తనకి ఆకస్మికంగా ఆరోగ్యం బాగోకపోయే సరికి తాను రాలేకపోతున్నానని ఈ బ్యాడ్ న్యూస్ ని అయితే షేర్ చేసింది.

తాను రాలేకపోతున్నందుకు హార్ట్ బ్రేక్ అయ్యింది అని చిరంజీవి గారితో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది అని చిత్ర యూనిట్ అంతటిని మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చింది.