నేటి తరం టాప్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్న సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ లు ఇప్పుడు గట్టి పోటీ ఇస్తున్నారు.
అయితే చిరు మార్కెట్ అలాగే ఉన్నప్పటికీ బాలయ్య మళ్ళీ అఖండ సినిమా నుంచి పూర్వ వైభవం తీసుకొచ్చారు.
దీనితో ఇద్దరు కూడా గట్టి పోటీ ఇస్తుండగా ఈ సంక్రాంతి కానుకగా ఒక రోజు తేడాతో ఇద్దరి సినిమాలు రిలీజ్ కాగా రెండు సినిమాలు కూడా సెన్సేషనల్ ఓపెనింగ్స్ దక్కించుకున్నాయి.
అయితే రెండు సినిమాల్లో నిర్మాణ సంస్థ ఒకటే కాగా ముయ్టి మేకర్స్ వీరసింహా రెడ్డి కి మొదటి రోజు వసూళ్లు 54 కోట్లు అని మొదటి రోజు కలెక్షన్స్ రివీల్ చేయగా.
వాల్తేరు వీరయ్య సినిమాకి మాత్రం మొదటి రోజు వసూళ్లు ఎంతో రివీల్ చేయలేదు.మరి ఇది ఎందుకా అనే ప్రశ్న వైరల్ గా మారగా ఇండస్ట్రీ వర్గాల్లో దీని ఆన్సర్ తెలుస్తుంది.
దీనికి కారణం అయితే వాల్తేరు వీరయ్యకి వీర సింహా రెడ్డి కన్నా ఎక్కువ కలెక్షన్ మొదటి రోజు నమోదు కాకపోవడమే అట.
దీనితో బాలయ్య సినిమా వసూళ్లు ఎక్కువ వచ్చి చిరు సినిమా తక్కువ వచ్చినవి అనౌన్స్ చేస్తే అది వేరేలా వెళ్తుందని అనౌన్స్ చేయలేదని తెలుస్తుంది.
ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం అయితే వాల్తేరు వీరయ్య కూడా 50 కోట్ల మేర గ్రాస్ నే అందుకుంది కానీ వీరసింహా రెడ్డి కన్నా ఒకటి రెండు కోట్లు తక్కువ వచ్చాయట. అందుకే అనౌన్స్ చేయలేదని భోగట్టా.