ఒక్కరోజులో బాలయ్య సినిమాని దాటేసిన “వాల్తేరు వీరయ్య”.!

ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి.

మరి దర్శకుడు కె ఎస్ రవీంద్ర తెరకెక్కించిన ఈ వింటేజ్ మెగా ఎంటర్టైనర్ అయితే మొదటి రోజు మంచి టాక్ సంతరించుకొని మరింత పుంజుకొని బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా ఏరియాల వారీగా కూడా అదరగొడుతున్నట్టు తెలుస్తుంది. అలా ఓవర్సీస్ మార్కెట్ ఓ మెగాస్టార్ మైండ్ బ్లాక్ చేస్తున్నాడు.

మొదటిగా ప్రీమియర్స్ లో బాలయ్య సినిమా వీరసింహా రెడ్డి చిత్రం లీడ్ ఓ ఉండగా దాని వెనక చిరు వాల్తేరు వీరయ్య ఉంది.

కానీ అనూహ్యంగా సింగిల్ డే లో బాలయ్య సినిమా అందుకోని ఫీట్ ని మెగాస్టార్ కొట్టేసినట్టుగా తెలుస్తుంది.

వీరసింహా రెడ్డి యూఎస్ లో రన్ రెండో రోజుకి వచ్చినప్పటికీ కూడా 1 మిలియన్ డాలర్ మార్క్ మార్క్ అందుకోలేదు

కానీ వాల్తేరు వీరయ్య మాత్రం జస్ట్ ప్రీమియర్స్ మరియు మొదటి రోజు వసూళ్లతోనే క్రాస్ చేసేసి మెగాస్టార్ నుంచి సెన్సేషనల్ కం బ్యాక్ ని ఇచ్చింది.

దీనితో మళ్ళీ మెగాస్టార్ అయితే తన మాసివ్ ట్రాక్ లోకి వచ్చారని చెప్పాలి. ఇక పండుగ సీజన్లో ఈ వసూళ్లు మరింత స్ట్రాంగ్ గా ఈ వసూళ్లు నమోదు కానున్నాయి.

మరి ఈ సినిమాలో మాస్ మహారాజ్ కూడా కీలక పాత్రలో నటించగా శృతి హాసన్ క్యాథెరిన్ లు హీరోయిన్స్ గా నటించారు.