ఎక్కడున్నావయ్యా విక్టరీ వెంకటేషూ.. అని అనుకుంటున్నారు ఆయన అభిమానులు.
నిఖార్సయిన సినిమా వెంకటేష్ నుంచి వచ్చి చాలాకాలమే అయ్యింది.
ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకున్నాడు సీనియర్ నటుడు వెంకటేష్.
త్వరలోనే తన కొత్త సినిమాతో సందడి చేయబోతున్నాడట. సరే, ఆ ‘త్వరలోనే ఎప్పుడు.?’ అన్నది పెద్ద డౌటానుమానం.
చాలా కథలు విన్నాడట ఆ మధ్య వెంకీ. కానీ, ఏదీ ఆయనకు నచ్చలేదట.
‘దృశ్యం’ ప్యాటర్న్‌లో ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్ పట్ల కొంత సానుకూలంగా వెంకీ వున్నట్లు తెలుస్తోంది.
అన్నీ కుదిరితే, సొంత బ్యానర్‌లోనే వెంకటేష్ ఆ సినిమా చేసే అవాకశం వుందంటున్నారు.
మీనా అయితే మొనాటనీ అవుతుందా.? ప్రియమణి అయితే ఎలా వుంటుంది.?
ఫర్ ఎ ఛేంజ్ అనుష్కని తీసుకొస్తేనో.? ఇలా చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
ఇది కాకుండా రానా దగ్గుబాటితో ఓ మల్టీస్టారర్ ఆలోచన కూడా వెంకీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వీటిల్లో ఏది ముందు సెట్స్ మీదకు వెళుతుందో మరి.!