వీర సింహారెడ్డి సక్సెస్ …. థియేటర్ ముందు మేకను బలిచ్చిన అభిమానులు…. ఎక్కడంటే?

  సాధారణంగా తమ అభిమాన హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే థియేటర్లో ముందు అభిమానులు చేసే హంగామా ఎలా ఉంటుందో మనకు తెలిసిందే.

 భారీ కటౌట్లు కట్టడం గజమాలలు వేయడం పాలాభిషేకాలు టపాసులు కాల్చడం వంటి కార్యక్రమాల ద్వారా ఆ హీరో పై వారికి ఉన్న అభిమానాన్ని చాటుకుంటారు.

 అయితే కరోనా కారణంగా థియేటర్ల ముందు ఇలాంటి వాతావరణం కనిపించక దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది.అయితే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ

 చిరంజీవి సినిమాలు విడుదల కాబోతుండడంతో థియేటర్లకు తిరిగి పూర్వ వైభవం వచ్చింది. అభిమానులు తమ అభిమాన హీరోల కటౌట్లను థియేటర్ల ముందు ఏర్పాటు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున పాలాభిషేకాలు చేస్తూ సందడి చేస్తున్నారు.

 ఇక నేడు ఎన్నో అంచనాల నడుమ బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని పెద్ద ఎత్తున థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తుంది.

 ఇక ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

  ఇకపోతే వీరసింహారెడ్డి సక్సెస్ టాక్ సొంతం చేసుకోవడంతో తిరుపతిలోని బాలయ్య అభిమానులు కాస్త అత్యుత్సాహం కనపరిచారు.

 దీంతో బాలయ్య అభిమానులు తిరుపతిలోని ప్రతాప్ థియేటర్ వద్ద ఏకంగా మేకపోతును బలి ఇచ్చి సంబరాలు చేసుకున్నారు.

 జై బాలయ్య అంటూ నినాదాలు చేయడమే కాకుండా మేకపోతును బలి ఇవ్వడంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

 అయితే ఈ వీడియో పై కొందరు పాజిటివ్ గా స్పందించగా మరికొందరు మాత్రం హీరోల సినిమాలు సక్సెస్ అయితే కూడా ఇలా మూగ జీవాలను బలి ఇస్తారా అంటూ మండిపడుతున్నారు.