సోషల్ మీడియాలో మామూలుగా లేని చరణ్ క్రేజ్.!

 ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ హిట్ సినిమాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ల సెన్సేషనల్ హిట్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి కాగా

 ఈ సినిమా తర్వాత ఇరు హీరోల క్రేజ్ కూడా భారీగా పెరిగింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం రామ్ చరణ్ కి ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోయింది.

 కాగా ఎన్టీఆర్ కన్నా సోషల్ మీడియాలో డబుల్ లెవెల్లో రామ్ చరణ్ ఫాలోయింగ్ పెరిగింది.

 అలా టాలీవుడ్ లో అయితే ఫాస్టెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో మిలియన్ కొద్దీ ఫాలోవర్స్ ని తాను అందుకుంటూ రికార్డులు సెట్ చేసాడు.

 అలాగే ఇప్పుడు మరో ఫాస్టెస్ట్ రికార్డు అయితే తాను అందుకొని ఇంకో రికార్డు సెట్ చేశారు.

 ఇప్పుడు చరణ్ 12 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ని అందుకొని మరో రికార్డు తన ఖాతాలో అయితే వేసుకున్నాడు.

 దీనితో సోషల్ మీడియాలో మాత్రం రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదని సినీ వర్గాల వారు అంటున్నారు.

 కాగా ఇప్పుడు చరణ్ అయితే దర్శకుడు శంకర్ తో  ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తుండగా దీనిలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

 అలాగే ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ఓ భారీ సాంగ్ షూట్ ని అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకోనుంది.

 దీనికి దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.