సుజీత్ సినిమాకి ఊహించని షేడ్స్.?

 గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న చిత్రాల్లో అయితే

 మంచి అంచనాలు ఉండి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో యంగ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న చిత్రం కూడా ఒకటి.

 అయితే ప్రస్తుతానికి ఓజి గా పిలవబడుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.

 అయితే ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఇప్పుడు సినీ వర్గాల్లో కొన్ని షాకింగ్ గాసిప్స్ వైరల్ గా మారాయి.

  దీనితో అయితే ఈ చిత్రంలో అసలు హీరోయిన్ ఉండదట సరే ఇది బాగానే ఉంది కానీ సినిమాలో ఫైట్స్ కూడా ఉండవట.. ఇక్కడే పవన్ ఫాన్స్ కి అసలైన షాక్ తగిలింది.

 అసలు సుజీత్ తో సినిమా అంటేనే భీకరమైన యాక్షన్ ని ఆశించారు పవన్ ఫ్యాన్స్. కానీ ఇప్పుడు హీరోయిన్ తో పాటు సినిమాలో ఫైట్స్ కూడా ఉండవు అనే మాటకి ఫ్యాన్స్ లో మాట రావడం లేదు.

 అయితే ప్రస్తుతానికి ఇది గాసిప్స్ మాత్రమే కాగా నిజంగానే ఫైట్స్ కూడా లేవు అంటే ఈ సినిమా అది ఊహించనిదే అని చెప్పాలి.

 అలాగే సుజీత్ సినిమాని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది కూడా కీలకంగా మారింది. ఇక ఈ భారీ సినిమా అయితే ఈ జనవరి 30 ముహూర్తం కుదుర్చుకోగా

 ఈ సినిమాపై మాత్రం మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉన్నాయి. ముఖ్యంగా సినిమా నేపథ్యంపై పవన్ ఫ్యాన్స్ క్లారిటీ కోరుకుంటున్నారు.