బొప్పాయి పండ్ల లో మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.
అయితే బొప్పాయి ఆకుల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు మన ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడుతున్నాయి అంటే ఆశ్చర్య పోవాల్సిందే కదా.
బొప్పాయి ఆకుల రసాన్ని తయారు చేసుకోవాలంటే మొదట ఆకులను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీ జార్లో మెత్తటి మిశ్రమంగా తయారు చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమానికి తగినన్ని నీళ్లు పోసి వడగట్టుకుంటే బొప్పాయి ఆకుల రసం రెడీ అవుతుంది.
బొప్పాయి ఆకుల రసాన్ని సేవిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి ఆకుల్లో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి కావున డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు బొప్పాయి ఆకుల రసాన్ని సేవిస్తే ఇందులో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాలు,
యాంటీ ఆక్సిడెంట్స్ వ్యాధి తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.అలాగే బొప్పాయి ఆకుల్లో అత్యధికంగా మిటమిన్ సి ఉంటుంది
ఇది మనలో వ్యాధికారకాలను తొలగించడంతోపాటు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
బొప్పాయి ఆకుల్లో ఉండే ఫైటో కెమికల్స్ ప్లేవనాయిడ్స్ ఉత్పత్తి చేసి గుండె ,ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీ సమస్యలకు కారణమయ్యే క్యాన్సర్ కారకాలను తగ్గించడంలో సహాయపడుతుంది
డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు బొప్పాయి రసాన్ని లేదా బొప్పాయి ఆకుల రసాన్ని సేవిస్తే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అధికంగా జరిగి డెంగ్యూ వ్యాధి నుంచి తొందరగా కోలుకుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు
దీనికి కారణం.బొప్పాయి ఆకుల్లో పుష్కలంగా ఉన్న విటమిన్ బి 9, బి12 ,పోలిక్ యాసిడ్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడడమే.
మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే రుతుక్రమం సమయంలో కడుపునొప్పి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది అంతేకాకుండా కాకుండా హార్మోన్ల సముతుల్యాన్ని కాపాడుతుంది.
అల్సర్ సమస్యతో బాధపడేవారు ఒక స్పూన్ బొప్పాయి ఆకు రసాన్ని సేవిస్తే జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.