యంగ్ టైగర్ ఎన్టీయార్ కొత్త సినిమా త్వరలో ఇంకోసారి ప్రారంభోత్సవం జరుపుకోనుంది.
మార్చి మూడో వారం నుంచి సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. ఈ నెలలోనే సినిమాని లాంఛనంగా ఇంకోసారి ప్రారంభిస్తారు.
కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ ప్రభావమో, ఇంకో కారణమోగానీ..
సినిమా ప్రారంభమవడానికి చాలా టైమ్ పడుతోంది. ఈ విషయమై యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు ఒకింత అసహనంతో వున్నారు.
కాగా, ఈ సినిమా కోసం తొలుత ఒకే హీరోయిన్ అనుకున్నా, ఇప్పుడు ఈక్వేషన్ మారిందనీ.. ఇద్దరు హీరోయిన్లు వుంటారనీ తెలుస్తోంది.
అందులో ఒకర్ని బాలీవుడ్ నుంచి ఇంపోర్ట్ చేయబోతున్నారట. మొదట అనుకున్న కథ కాకుండా,
వేరే కథ మీద కొరటాల శివ వర్క్ చేసి, ఓ షేప్ తీసుకొచ్చాడని అంటున్నారు.
ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీయార్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడన్నది తాజా ఖబర్.