ట్విట్టర్ రివ్యూ : మాస్ మహారాజ్ “ధమాకా” పేలిందా.?

ఈ ఒక్క ఏడాదిలోనే మూడు సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది మాస్ మహారాజ రవితేజ అనే చెప్పాలి.

తన మార్క్ స్పీడ్ తో రవితేజ కంప్లీట్ చేసిన సినిమా “ధమాకా”. ఎంటర్టైనింగ్ దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ లో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించారు.

అయితే ఈ చిత్రం ఈరోజు రిలీజ్ కాగా దీనితో అయినా రవితేజ మంచి హిట్ అందుకోవాలని అయితే అంతా ఆసక్తిగా ఉన్నారు.

మరి దీనికి ఆల్రెడీ యూఎస్ లో ప్రీమియర్స్ పడగా అక్కడ నుంచి అయితే సినిమా ఎలా ఉందో ట్విట్టర్ ప్రజానీకం చెప్తున్నారు.

మరి వారి టాక్ ప్రకారం అయితే ధమాకా ఆల్ మోస్ట్ సేవ్ అయ్యినట్టే అనిపిస్తుంది.

అయితే ఈ చిత్రంలో పెద్దగా కొత్త స్టోరీ లేకపోయినప్పటికీ రవితేజ మాత్రం తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టినట్టుగా తెలుస్తుంది.

అలాగే శ్రీ లీల కోసం కూడా ఆడియెన్స్ బాగా చెప్పుకుంటున్నారు.

ఆమె నటన ఏమో కానీ సాంగ్స్ లో మాత్రం అదరగొట్టింది అట అలాగే లుక్స్ పరంగా కూడా ఇంప్రెస్ చేయగా మరో హైలైట్ సినిమాలో ట్విస్ట్ లు అట. ట్విస్ట్ లు సినిమాలో అదిరిపోయాయని అంటున్నారు.

అలాగే పాటలు కూడా ఆన్ స్క్రీన్ బాగున్నాయట. దీనితో అయితే ఓవరాల్ గా కాస్త పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తోనే ధమాకా పేలినట్టే చెప్పుకోవాలి. మరి మన దగ్గర రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.