త్రివిక్రమ్.. మళ్ళీ ముగ్గురు హీరోయిన్లా?

 మహేష్ బాబు, త్రివిక్రమ్ హిట్ కాంబో. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు మూవీ ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 ఈ మూవీని ఎన్నో సార్లు చూసిన వారు చాలా మంది ఉంటారు. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని, ఎంటర్‌ టైన్ చేసే మూవీ అతడు.

 త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ బాబు కాంబోలో వచ్చిన మరో మూవీ ఖలేజా. ఈ మూవీ కమర్షియల్ గా హిట్ అందుకోకపోయినా.. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

 మహేష్ బాబును ఇప్పటి వరకు చూడని కొత్త తరహా క్యారెక్టరైజేషన్ లో చూసి ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు.

 ఈ మూవీని ఇప్పటికీ ఎంతో మంది చాలా ఇష్టంగా చూస్తుంటారు. ఈ హిట్ కాంబోలో వస్తున్న మూడో సినిమా SSMB28.

 త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుండి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

 త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ను SSMB28 లో రిపీట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే SSMB28 లో పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే.

  ఇప్పుడు మూడో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ను తీసుకున్నట్లు సమాచారం.

 అంతకుముందు త్రివిక్రమ్ – బన్నీ కాంబోలో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలోనూ ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు.

 సమంత, నిత్యా మీనన్, ఆదా శర్మ సన్నాఫ్ సత్యమూర్తి మూవీలో నటించారు. మహేష్ బాబుకు కూడా ఈ సెంటిమెంట్ కలిసి వచ్చిందని త్రివిక్రమ్ కు,

 మహేష్ బాబుకు నచ్చే సెంటిమెంట్ కావడంతో మూవీ టీమ్ ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు గత సినిమా అయిన బ్రహ్మోత్సవంలో కూడా ముగ్గురు హీరోయిన్లు చేశారు.

 మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ రిలీజ్ కు ముందే రికార్డు సృష్టించింది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తికాకముందే ఓటీటీ డీల్ కుదిరింది.

 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.