కొత్త ఇల్లు కొనుగోలు చేసిన త్రిష… ఇంటి ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

 దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి త్రిష ఒకరు.

 ఈమె వయసు పైబడిన తరగని అందంతో ఇప్పటికి వరుస సినిమా అవకాశాలను అందుకుంటు ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

 ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు దశాబ్దన్నార కాలం పూర్తి అయినప్పటికీ త్రిషకు ఏ మాత్రం అవకాశాలు తగ్గలేదని చెప్పాలి.

 తాజాగా ఈమె మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

 ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో త్రిష వరుస సినిమా అవకాశాలు అందుకోవడమే కాకుండా తన రెమ్యూనరేషన్ విషయంలో కూడ భారీగా డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది.

 అయితే ఇలా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి త్రిష చెన్నైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

 దాదాపు 35 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ఇంటిని కొనుగోలు చేసినట్టు సమాచారం.

 ఇక త్రిషఈ ఇంటిపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఈ ఇంటిలో తనకు నచ్చిన విధంగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నారు అని తెలుస్తుంది.

 ఇక ఇంట్లో ప్రత్యేకంగా ఒక పూజ గది స్విమ్మింగ్ పూల్ అలాగే అధునాతన సౌకర్యాలతో ఈ ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దుకోబోతున్నట్లు సమాచారం.

 ఇక పెళ్లయిన కూడా త్రిష ఈ ఇంటిలోనే ఉండాలని భావించి ఇలా తన ఇంటిని తన ఇష్టాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్నారు.

 మొత్తానికి త్రిష 35 కోట్ల విలువ చేసి ఇంటిని కొనుగోలు చేశారని తెలియడంతో కోలీవుడ్ సెలబ్రిటీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.