స్వాతంత్రం వచ్చి ఇంతకాలం అయినా ఇప్పటికీ భారతదేశంలో ఒకటే తరహా రాజకీయాలు.. ఊపదంపుడు వాగ్దానాలు, గద్దెనెక్కిన అనంతరం రాచరిక పోకడలు.
ఆర్థిక బలానికి మాత్రమే పెద్దపీట! మరో 100ఏళ్లు అయినా… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధికి పాటుపడతాం వంటి సోది కబుర్లు – సొల్లు వాగ్ధానాలు!
మాటల్లో ఉన్న నిజాయితీ, వాగ్ధానాల్లో ఉన్న కమిట్ మెంట్.. చేతల్లోకి వచ్చేటప్పటికి చీకటిలో కలిసిపోతున్న పరిస్థితి! ఈ పరిస్థితుల్లో జగన్ ఒక కీలకమైన అడుగు వేశారు..
అది కూడా చారిత్రాత్మకమైన అడుగు!అవును… ఎన్నడూ చట్టసభల్లోకి అడుగుపెట్టని కులాల వారిని వెతికి వెతికి మరీ జగన్ పదవులు ఇవ్వడం పార్టీలోనే కాదు..
దేశం మొత్తం చర్చనీయాంశమైంది. ఎన్నడూ తమ సామాజికవర్గానికి అలాంటి అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించని వారికి చట్ట సభల్లో స్థానం కల్పిస్తున్నారు.
శాసనమండలిలో అడుగుపెట్టడం సామాన్య విషయమేమీ కాదు కదా!ఎందుకంటే… శాసనమండలిని మొదలుపెట్టిన ఉద్దేశ్యం ఒకటైతే, అనంతర కాలంలో ఆ ఉద్దేశ్యం,
లక్ష్యం తుప్పుపట్టిపోయిన పరిస్థితి. రాజకీయ నిరుద్యోగులకు, ఆర్థికంగా బలమైన వ్యక్తులకు అవి ఆవాసాలుగా మారిపోయాయి. ఎంతలా అంటే… పార్టీకి ఇచ్చే ఫండ్ ని బట్టి సీటు దొరికేటంత!
అయితే.. ఉన్నఫలంగా జగన్ తనదైన ప్రక్షాళన మొదలుపెట్టారు!ఫలితంగా… పార్టీని నమ్ముకుని ఉంటే జగన్ ఎప్పటికైనా తమకు మంచి పదవులు ఇస్తారన్న నమ్మకం కార్యకర్తల్లో
కలిగేలా కూడా చేసుకోగలిగారు. రాజకీయంగా ఏమాత్రం పలుకుబడి లేని వాళ్లకు పదవులు సులువుగా జగన్ ఇచ్చారంటే.. తమకు మాత్రం ఫ్యూచర్ లో ఎందుకు రావన్న ధీమా
మిగిలిన కార్యకర్తల్లో పెంచేపనికి పూనుకున్నారు జగన్!ఈ సమయంలో కూడా ఒక వ్యక్తికి పదవి ఇచ్చినంత మాత్రాన సామాజికవర్గమంతా బాగుపడిపోయినట్లేనా
అని ఈకలు పీకేవారు లేకపోలేదు. కానీ.. ఆ కులాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వడం వల్ల.. ఆ కులం సమస్యలు పరిష్కారానికి సులువైన మార్గం
ఆ ఒక్క వ్యక్తి ద్వారా దొరుకుతుందనడంలో అతిశయోక్తి లేదు కదా! ఫలితంగా… ఈ విషయంలో జగన్ పూర్తిగా సక్సెస్ అయ్యారని.. చరిత్ర తిరగరాసారాని, ట్రెండ్ సెట్ చేశారని చెబుతున్నారు విశ్లేషకులు!