కోలీవుడ్ హీరో సూర్యకు తెలుగులో మంచి ఆదరణ ఉంది. డబ్బింగ్ మూవీల్లా కాకుండా సూర్య సినిమాలను ఇక్కడ చాలా మంది చూస్తారు. ఇక్కడ కూడా సూర్యకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
ఆయన సినిమాలకు ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. సూర్య సినిమాలు యూనిక్ పాయింట్ తో చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో సూర్య నుండి వచ్చిన ఆకాశం నీ హద్దురా,
జై భీమ్ సినిమాలు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు వరుస హిట్ల తర్వాత సూర్య నుండి రానున్న నెక్స్ట్ మూవీపై అంచనాలు నెలకొన్నాయి.
వాటికి తగ్గట్లుగానే భారీ బడ్జెట్ తో పిరియాడికల్ మూవీ చేస్తున్నారు సూర్య. దర్శకుడు శివతో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై సూర్య 42 మూవీ తెరకెక్కనుంది.
సూర్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా నిలవనుందని ఇండస్ట్రీలు వర్గాలు అంటున్నాయి. అయితే ఇందుకు సంబంధించి తాజాగా సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించే అప్డేట్ ఒకటి ఈ మూవీ నుండి వచ్చింది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు పార్ట్ లుగా రానున్న విషయం తెలిసిందే. అయితే పాన్ ఇండియా లెవల్ లో సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు
మూవీ మేకర్స్ ఓ క్రేజీ థాట్ తో ముందుకు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. బాహుబలి, సాహో, రాధేశ్యామ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ కూడా
ఈ మూవీలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రెండు పార్ట్ లుగా తెరకెక్కుతున్న వీర్ మూవీలో ప్రభాస్ లాంటి అగ్ర కథానాయకుడు ఉంటే సినిమాకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ వస్తుందని మూవీ టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సూర్యతో కలిసి నటించడానికి ప్రభాస్ కూడా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అనుకున్నట్లుగా అన్నీ కుదిరితే సూర్య ప్రభాస్ పక్కపక్కన కనిపించడం ఖాయంగా తెలుస్తోంది.
మరి దీని గురించి మూవీ టీం నుండి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. వివేకం, వేదాళం లాంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు శివ.. సూర్య 42 సినిమాకు డైరెక్షన్ చేయనున్నారు.
ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. వీర్ మూవీ 10 భాషల్లో రిలీజ్ కానుందట. సినిమాపై మంచి బజ్ ఉంది. దీంతో షూటింగ్ పూర్తి కాకముందే బయ్యర్లు సినిమాకు టెప్టింగ్ రేట్లు ఆఫర్ చేస్తున్నారట.
వీర్ సినిమాలు సూర్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ నటిస్తున్న సంగతి తెలిసిందే.