ప్రేమలో సక్సెస్ అయి పెళ్లి చేసుకోవాలంటే పెద్దలను ఇలా ఒప్పించండి!

 ఈ రోజుల్లో పెద్దలు కుదిర్చిన సాంప్రదాయ వివాహాల కంటే ప్రేమ వివాహాలే ఎక్కువగా జరుగుతున్నాయి.

 పూర్వపు రోజుల్లో మన పెద్దవారు అబ్బాయి అమ్మాయి కుటుంబ సభ్యుల నిర్ణయాలను పరిగణలోకి తీసుకొని వివాహాలు చేసేవారు అందుకే సాంప్రదాయ వివాహాలే ఎటువంటి సమస్యలు తలెత్తకుండా దీర్ఘకాలం పాటు సాఫీగా సాగిపోయేవి.

 అయితే ఈనాటి యువతరం తెలిసి తెలియని వయసులో కలిగే వ్యామోహమే ప్రేమగా భావించి పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకుంటున్నారు.

 పెద్దవాళ్లు ఈ వివాహాలకు ఒప్పుకోకపోతే ఆత్మహత్యకు కూడా పాల్పడుతున్నారు. అలాకాకుండా మీరు ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవడానికి మీ తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేయండి.

 తల్లిదండ్రులు ఎవరైనా మీ మంచినే కోరుకుంటారు కాబట్టి మొదట మీరు ప్రేమించిన విషయాన్ని మీ పేరెంట్స్ కు చెప్పే ప్రయత్నం చేయండి.

 ఒప్పుకోకపోతే ఓర్పుగా పదేపదే చెబుతూ ఒప్పించే ప్రయత్నం చేయాలి. మీరు ప్రేమ వివాహం చేసుకోవాలంటే మొదట మీ తల్లిదండ్రులు అడిగే ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం తెలుసుకోవాలి.

 మీరు ఎవరినైనా ఇష్టపడుతుంటే మొదట మీ తల్లిదండ్రులకు చెప్పి ఆ అమ్మాయి కుటుంబ వ్యవహారాలు ఆ అమ్మాయి గురించి తెలుసుకోమని చెప్పండి. వినకపోతే ఒప్పించే ప్రయత్నం చేయండి.

 మొదట మీ తల్లిదండ్రులకు ప్రేమ వివాహాలపై ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోండి ఆ తర్వాత నెమ్మదిగా మీ తల్లిదండ్రులకు అర్థమయ్యే విధంగా మీ ప్రేమ వ్యవహారాన్ని చెప్పి పంపించే ప్రయత్నం చేయండి.

 ఒకవేళ మీ పేరెంట్స్ మీ ప్రేమను ఒక్కోకపోతే ఎందుకు ఒప్పుకోవట్లేదు గల కారణాలు కూడా తెలుసుకోండి. అప్పుడే మీరు వారి భయాలను పోగొట్టి మీ ప్రేమను గెలిపించుకోవడానికి అవకాశం దొరుకుతుంది.

 మీ తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా ఒప్పుకోకపోతే మీ సమీప నమ్మకమైన బంధువులను లేదా స్నేహితుల సహాయం తీసుకోండి తప్పేం లేదు.

 వీలైతే మీరు ప్రేమించిన అమ్మాయిని మీ తల్లిదండ్రులు కలిసే ఏర్పాట్లు చేయండి.