బాలయ్యకు…. నాగార్జునకు ఎంత తేడా ఎన్టీఆర్ లీవ్స్ అంటూ నాగ్ కామెంట్స్ వైరల్!

 ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఏదైనా వివాదం చెలరేగుతోందా అంటే అది బాలయ్య అక్కినేని ఫ్యామిలీ పై చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది

  ఇలా బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ అక్కినేని ఫ్యామిలీ గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యల పట్ల నందమూరి అక్కినేని అభిమానుల మధ్య తీవ్ర వివాదం నెలకొంది.

 అక్కినేని ఫ్యామిలీ గురించి బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలి అంటూ అక్కినేని ఫ్యాన్స్ డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు.

 అదేవిధంగా గతంలో ఎన్టీఆర్ గురించి నాగార్జున చేసినటువంటి కామెంట్లకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు.

 గత ఏడాది నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.

 ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఎన్టీఆర్ వర్ధంతి జనవరి 18వ తేదీ గత ఏడాది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున ఎన్టీఆర్ ఏఎన్నార్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు.

 ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళు లాంటివారని నాగార్జున మాట్లాడారు. ఎన్టీఆర్ లీవ్స్ ఆన్ ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్ అంటూ దివంగత నటుల గురించి నాగార్జున ఎంతో గొప్పగా మాట్లాడారు.

 ఇలా ఎన్టీఆర్ వర్ధంతి రోజున నాగార్జున ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడి తన వ్యక్తిత్వం ఏంటో నిరూపించుకున్నారు

 కానీ బాలకృష్ణ మాత్రం ఏఎన్ఆర్ వర్ధంతి రోజున అక్కినేని తొక్కినేని అంటూ అక్కినేని ఫ్యామిలీనీ కించపరిచే విధంగా మాట్లాడారు.

దీంతో అక్కినేని అభిమానులు ఫైర్ అవుతూ నాగార్జునకున్న సంస్కారం బాలయ్యకు ఏమైంది? ఇద్దరూ అగ్ర హీరోలే కానీ ఇద్దరికీ ఎంత తేడా ఉందో అంటూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.