తిరుమల గదుల అద్దె రేటు పెంపు.. జగన్ సర్కార్ నిర్ణయం రైటా? రాంగా?

 ఏపీ సీఎం జగన్ కు పదుల సంఖ్యలో సలహాదారులు ఉన్నారు. ఆ సలహాదారుల కోసం జగన్ ప్రతి నెలా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది.

 అయితే సామాన్య ప్రజల విషయంలో మాత్రం జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 తాజాగా జగన్ సర్కార్ తిరుమలలో వసతి గదుల రేట్లను పెంచడంపై సామాన్యుల నుంచి సైతం విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

 500 రూపాయల అద్దె ఉండే వసతి గదుల రేటు ఏకంగా మూడు రెట్లు పెరగనుందని తెలుస్తోంది.

 సామాన్య ప్రజలు తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవాలంటే 8000 రూపాయల నుంచి 10000 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి

 అయితే ఏర్పడే అవకాశం అయితే ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం జగన్ సర్కార్ తీసుకున్న మరో రాంగ్ డెసిషన్ అని చాలామంది భావిస్తున్నారు.

 దేవుడి దర్శనం విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురు కావడం గతంలో ఎప్పుడూ జరగలేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 జగన్ సర్కార్ టీటీడీ బోర్డ్ ను ఏర్పాటు చేసిన తర్వాత ధరలను తరచూ పెంచుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. భక్తుల్ని టీటీడీ బాదేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 స్టార్ హోటళ్ల రేంజ్ లో ఈ రేట్లు ఉన్నాయని చాలామంది చెబుతున్నారు.

 నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయాలను మార్చుకుంటే బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 ఇదే తరహా తప్పులను రిపీట్ చేస్తే వైసీపీ భవిష్యత్తుకే ప్రమాదమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.