తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బండ్ల గణేష్ ఈమధ్య కాలంలో ఎలాంటి సినిమాలను నిర్మించలేదు.
అయినప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయంపై స్పందిస్తూ ఉంటారు.
ఇలా ఇండస్ట్రీ విషయాల గురించి మాట్లాడుతూ పలుసార్లు ఈయన చేసే వ్యాఖ్యలు తీవ్రమైన వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి.
ఇలా తరచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తలలో నిలిచే బండ్ల గణేష్ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొని కొన్ని విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ తాను ఏ విషయం గురించి ఆయన మాట్లాడాను అంటే అందులో తప్పనిసరిగా నిజం ఉంటేనే మాట్లాడతానని తాను ఎప్పుడూ కూడా అబద్ధాలు తప్పులు మాట్లాడానని తెలిపారు.
ఇక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేయాలి అందుకే తాను కేసీఆర్ చేసిన ఎంతో మంచి పనులకు సపోర్ట్ చేస్తున్నానని తెలిపారు.
అయితే కొందరు మాత్రం నేను చేసే పనులను దృష్టిలో పెట్టుకొని నన్ను అవమానిస్తూ ఉంటారు.నీది షాద్ నగర్ కదా హైదరాబాదులో ఎందుకు ఉన్నావ్ అక్కడికి వెళ్లి కోళ్ల వ్యాపారం చేసుకో అంటూ చాలామంది అవమానించారు.
ప్రస్తుతం నేను కోళ్ల వ్యాపారం చేస్తూనే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టాను. దేవుడి దయవల్ల నా వ్యాపారం చాలా బాగుంది. ప్రస్తుతం నా వద్ద వెయ్యి మందికి పైగా పని వాళ్ళు ఉన్నారు.
ఇక నిర్మాతగా నేను చేసిన సినిమాలు కూడా మంచి సక్సెస్ అందించాయి.
కానీ ఎవరైతే నన్ను అవమానించారో వాళ్ళు మాత్రం చనిపోయారని నన్ను అవమానించిన వాళ్ళు చనిపోతారంటూ ఈ సందర్భంగా బండ్ల గణేష్ చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
ఇక నాకు రామ్ చరణ్ కు మధ్య మనస్పర్ధలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ మా ఇద్దరి మధ్య ఏ విధమైనటువంటి మనస్పర్థలు లేవని ఈ సందర్భంగా గణేష్ క్లారిటీ ఇచ్చారు.