ప్రభాస్ తో కన్ఫర్మ్ చేసిన యంగ్ హీరోయిన్.!

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఒకదాని తర్వాత ఒక సినిమాని లైన్ గా కానించేస్తున్న డార్లింగ్ అనధికారికంగా అనౌన్స్

చేసిన ఓ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ కూడా చేస్తున్నాడు.మరి ఈ చిత్రం అయితే దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తుండగా ప్రభాస్ ఈ చిత్రాన్ని సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్నాడు.

మరి ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి అనేది పక్కన పెడితే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మొత్తం ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారని తెలిసిందే.

మరి వీటిలో లేటెస్ట్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా ఉందని టాక్ ఉంది. అయితే దీనిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని స్వయంగా ఈ యంగ్ బ్యూటీనే కన్ఫర్మ్ చేసింది.

తాజాగా ఈమె సినిమా ధమాకా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ప్రభాస్ తో సినిమా కోసం కామెంట్స్ చేసింది.ప్రభాస్ తో మూవీ ఎప్పుడు అని ఫ్యాన్స్ అడగ్గా నవ్వుతు త్వరలో త్వరలో అంటూ కన్ఫర్మ్ చేసేసింది.

దీనితో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో అయితే గత కొన్నాళ్ల నుంచి ఉన్న రూమర్స్ ఇప్పుడు నిజం అయ్యాయని చెప్పాలి.

ఇక ఈ చిత్రాన్ని అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నటిస్తుండగా మాళవిక మోహనన్ కూడా ఈ సినిమాలో నటిస్తుంది.