“ధమాకా” లో ఈ రెండు ఎపిసోడ్స్ బిగ్ హైలైట్ సీన్స్ అట..!

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “ధమాకా” కోసం అందరికీ తెలిసిందే.

మరి ఈ చిత్రం ఈ డిసెంబర్ 23న గ్రాండ్ గా రిలీజ్ కానుండగా 22 నుంచే యూఎస్ లో అయితే ఈ చిత్రం ప్రీమియర్స్ తో ముందే  పలకరించనుంది.

అయితే ఈ చిత్రం నుంచి నిన్నే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగగా సినిమా యూనిట్ సహా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కూడా వచ్చారు

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంలో అయితే రెండు సూపర్ హైలైట్ సీన్స్ కోసం ఇంట్రెస్టింగ్ సమాచారం ఈ చిత్ర దర్శకుడు త్రినాధరావు నక్కిన బయటపెట్టారు.

అయితే తాను లేటెస్ట్ గా మాట్లాడుతూ ఈ సినిమాలో క్లైమాక్స్ కి ముందు ఓ సాంగ్ ఉంటుంది అట ఈ సాంగ్ కి అయితే థియేటర్స్ లో సీట్లు కూడా లేచిపోతాయి అని తాను మరింత హైప్ ఇచ్చేసారు.

ఇక ఈ సినిమాలో మరో హైలైట్ అయితే ఈ సినిమాలో రావు రమేష్ మరియు హైపర్ ఆది ల మధ్య ఎపిసోడ్ లు అట.ఇవి సినిమాలో బిగ్ హైలైట్ గా నిలుస్తురట.

గతంలో అదిరే కాంబినేషన్ రావు గోపాల్ రావు మరియు అల్లు రామలింగయ్య కాంబినేషన్ కోసం తెలిసిందే మరి వీరిని గుర్తు చేసుకునేలా ఉంటుంది అని తెలిపారు.

మరి డెఫినెట్ గా ఇది అలా ఉంటుందా లేదా అనేది చూడాలి.