ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర వస్తున్న సినిమాల నుంచి పదేళ్ల వెనక్కి వెళ్లినట్టు అయితే తెలుగు మరియు తమిళ సినిమా నుంచి కూడా ఎన్నో క్లాసిక్ లు ఉన్నాయి.
అలాగే ఇప్పుడు మరుగున పడిపోతున్న దర్శకుల్లో చాలా మంది అప్పట్లో చాలా మంచి సినిమాలు అందించారు.
మరి దీనితో అలాంటి దర్శకులు అప్పుడు తాము తీసిన క్లాసిక్ హిట్స్ కి సీక్వెల్స్ ఇప్పుడు అనౌన్స్ చేస్తూ మళ్ళీ ట్రాక్ లో పడాలని చూస్తున్నారు.
అలా కోలీవుడ్ దర్శకుడు ఎన్ లింగుసామి ఆల్రెడీ పందెం కోడి కి సీక్వెల్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా తర్వాత మరో సూపర్ హిట్ “ఆవారా” కి సీక్వెల్ పనుల్లో ఉన్నారు.
అయితే బేస్ లైన్ తో సీక్వెల్ కి టోటల్ స్క్రిప్ట్ నే మార్చేస్తున్నారు. అలాగే అప్పుడు సినిమాలో కార్తీ తమన్నా హీరో హీరోయిన్స్ గా నటించగా
సీక్వెల్ కి ఏకంగా వీరిని మార్చే మార్చేశారు. ఒరిజినల్ గా తమిళ్ లో ఈ సినిమా “పైయన్” కాగా ఇప్పుడు దీని సీక్వెల్ లో హీరో ఆర్య నటించబోతున్నాడు.
మరి ఈసారి పార్ట్ 2 లో అయితే స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పేరు పరిశీలనలో ఉందట.
దీనితో ఈ ఇంట్రెస్టింగ్ బజ్ అయితే తమిళ సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. మరి హీరో హీరోయిన్స్ నే మార్చేయడం అనేది ఒకింత అందరికీ ఆశ్చర్యంగా ఉంది
దీనితో లింగుసామి ఆ క్లాసిక్ హిట్ సీక్వెల్ ని ఎలా హ్యాండిల్ చేస్తారా అని అందరిలో ఆసక్తి కూడా నెలకొంది.