నీ చెత్త చరిత్ర ఇదీ బాలయ్య.. వైసీపీ నేతల పంచ్ లు మామూలుగా లేవుగా?

 స్టార్ హీరో బాలయ్య ఏ ఈవెంట్ లో మాట్లాడినా తమ చరిత్రే గొప్ప చరిత్ర అని ప్రచారం చేసుకుంటారు. ప్రతి సినిమాలో అధికారంలో ఉన్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు.

 అయితే నందమూరి అసలు చరిత్ర ఇదీ అంటూ వైసీపీ నేతల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

 బెల్లంకొండ సురేష్ పై బాలయ్య కాల్పులు ఎందుకు జరిపాడో చెప్పాలని వైసీపీ నేతలు కోరుతుండటం గమనార్హం.

 బాలయ్య ఇంట్లో వాచ్ మేన్ ఏ విధంగా చనిపోయాడో నిజం చెప్పాలంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

 నందమూరి కుటుంబానిదే చరిత్ర అనే విధంగా బాలయ్య చేస్తున్న కామెంట్ల గురించి సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 సీనియర్ ఎన్టీఆర్ టిఫిన్ సరిపోవడం లేదని ప్రొడక్షన్ మేనేజర్లతో గొడవ పడ్డాడని నచ్చిన డ్రెస్ లను, నచ్చిన వస్తువులను ఇంట్లో దాచుకునేవారని వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.

 మల్లెమాల ఆత్మకథ చదివితే సీనియర్ ఎన్టీఆర్ బుద్ధి తెలుస్తుందని భువనేశ్వరి పెళ్లి ఖర్చులు ఎవరు పెట్టుకున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

 దర్శకనిర్మాత మల్లెమాల హైదరాబాద్ శివారులోని నిమ్మతోటకు మొక్కలు ఇస్తే ఎన్టీఆర్ ఒక్క పైసా ఇవ్వలేదని ఇదే అసలైన చరిత్ర అని వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.

 నాదెండ్ల భాస్కరరావు ఎందుకు తిరుగుబాటు చేశారని 1989లో ఎన్టీఆర్ ఎందుకు ఓడిపోయాడని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

 సీనియర్ ఎన్టీఆర్ ఎందుకు వెన్నుపోటుకు గురయ్యాడని ఆ వెన్నుపోటును బాలయ్య ఎందుకు సమర్ధిస్తున్నాడని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.

 రాజకీయాల కోసం బాలయ్య ఓటీటీ షోలను వాడుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 అమ్మాయిల గురించి అసభ్యంగా మాట్లాడిన బాలయ్య చరిత్ర గురించి మాట్లాడటం కరెక్టా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.