ఇందుకే కదా బాబులని జనం నమ్మనిది!!

 తప్పంటే… ఎవరు చేసినా తప్పే! మాకు కావాల్సిన వాడు చేస్తే ఒకరకం.. ప్రత్యర్థి చేస్తే మరో రకం అన్నది రాజకీయాల్లో అస్సలు సాధ్యం కాని పని.

 ఎందుకంటే… ఇక్కడ అన్ని విషయాలు జనాలు క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. ప్రతీ ఒక్కరినీ లిట్మస్ టెస్ట్ చేస్తుంటారు. విచిత్రం ఏమిటంటే…

 జనాలు గమనించరులే అని 2019 ఎన్నికల ఫలితాలు అలా వచ్చాక కూడా ఇంకా బాబు మారలేదు! జనాలను తక్కువ అంచనా వేయడం ఆపలేదు!

 వివరాల్లోకి వస్తే… దేశంలో ఊరూరా ధరల పెరుగుదలకు జగన్ నే కారణం.. ఇంకా గట్టిగా మాట్లాడితే… పెట్రోలు మంటలకు కూడా జగన్ నే కారణం అని విమర్శలు చేస్తుంటారు

 చంద్రబాబు – చినబాబు లోకేష్! ప్రతిపక్షలు కాబట్టి ప్రజల తరుపున తమ గొంతు అలా వినిపిస్తున్నారని అనుకుంటే… కేంద్రంలో మోడీ చేసిన ఏ పనిమీదా కనీసం స్పందించరు.

  ఆ విషయం తాము గ్రహించలేదే.. అన్నట్లుగా ఫెర్ఫార్మెన్స్ చేస్తుంటారు.తాజాగా గ్యాస్ సిలెండర్ పై యాభై రూపాయలు పెంచింది మోడీ సర్కార్.

 కానీ… బాబు – చినబాబు కనీసం నోరు మెదపరు. మోడీ అంటే వారి భయం ఆ స్థాయిది! 2014 ఎన్నికల అనంతరం కేంద్రాన్ని –

 మోడీని ఏదైనా అడగడానికి బాబు అసలు ధైర్యం చేసేవారు కాదు. దాని ఫలితమే ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ! ఆ విషయాలు జనాలు ఇంకా మరిచిపోకముందే…

 రాబోయే కాలంలో కూడా తాను అధికారంలోకి వస్తే… కేంద్ర పెద్దల విషయంలో ధైర్యం చేయలేనని చంద్రబాబు ఇలా చెప్పకనే చెబుతున్నారు!నం నమ్మనిది!!

 మోడీ హయాంలో దాదాపు వెయ్యి రూపాయలు పెరిగింది గ్యాస్ సిలెండర్ ధర. తాజాగా గృహవసరాలకు వినియోగించే సిలిండర్ పై మరో యాభై రూపాయలు పెంచిన

 మోడీ సర్కార్… 19కిలోల కమర్షియల్ సెలెండర్ పై రూ.350.50 పెంచింది!ఈ పరిస్థితుల్లో మరో ప్రతిపక్ష పార్టీ అయితే.. గ్యాస్ సిలెండర్లు మెడలో కట్టుకుని రోడ్లపైకి వచ్చి

 నానా హడావిడీ చేసేవారు. ప్రజల్లో కలిసేవారు. ప్రజల ఆవేదన్నను కేంద్రానికి వినిపించే పనికి పూనుకునేవారు! కానీ… ఇక్కడున్నది చంద్రబాబు!

 ఆయన అధికారంలో ఉన్నా – ప్రతిపక్షంలో ఉన్నా.. జగన్ ని తప్ప మరెవరినీ ప్రశ్నించలేరు – విమర్శించలేరు. కేంద్రంలో మోడీని అయినా.. తెలంగాణలో కేసీఆర్ ని అయినా!! బాబు వల్ల కాదంతే…!