గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ గాడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ తో కలిసి మొదటి సారిగా స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది.
మరి ఈ సెన్సేషనల్ కలయిక ఓటిటి హిస్టరీ లో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసి కొత్త రికార్డులు సెట్ చేసింది.
అయితే రెండు పార్ట్స్ గా ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్ నుంచి పొలిటికల్ ఎపిసోడ్ అయితే నిన్న బయటకి వచ్చింది.
మరి ఇందులో బాలయ్య ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడగడం దానికి పవన్ ధీటైన సమాధానాలు అందివ్వడం పవన్ ఫ్యాన్స్ కి ఓ రేంజ్ కిక్ ని ఇచ్చాయి.
ఇక ఈ క్రమంలో పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నుంచి అయితే తనకు నేర్చుకున్నది ఏంటి వద్దు అనుకున్నది ఏంటి అనే అంశాలు తాను రివీల్ చేసారు.
అయితే అన్నయ్య నుంచి హార్డ్ వర్క్ అనేది బాగా నేర్చుకున్నానని కానీ అయన దగ్గర నుంచి నేర్చుకోనిది ఏదన్నా ఉంది అంటే
అది తన మొహమాటం నేను తీసుకోకూడదు అనుకున్నానని తెలిపాడు. అన్నయ్య తనని ఎవరు ఎన్ని అన్నా కూడా సీరియస్ గా తీసుకోరు
అని ఈ ఒక్కటి మాత్రం తన దగ్గర నుంచి నేను వద్దు అనుకున్నానని. దాని వల్ల ఏమవుతుంది అంటే మనం ఎంత సౌమ్యంగా ఉన్నా
ఒకోసారి తిరిగి మాట్లాడకపోతే చేతకానితనంలా వారికి అనిపిస్తుంది అని అందుకే తాను ఎవరన్నా ఎమన్నా అన్నా
ముందు ఊరుకున్నా తర్వాత మాత్రం సమాధానం ఇస్తానని తాను తెలిపాడు. అయితే ఇక్కడ తన అన్నయ్యని ఏమీ తక్కువ చేయలేదు
ఆయనకి క్షమా గుణం ఎక్కువ అన్నట్టు కూడా కవర్ చేసి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.