ప్రభాస్ వరల్డ్ సినిమా క్రేజీ గాసిప్స్ పై క్లారిటీ ఇదే.!

 ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి హైప్ తో ఉన్న భారీ చిత్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలే చాలా ఉన్నాయి.

 చాలా వరకు అన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో పాన్ ఇండియా తో పాటుగా ఆసియ మరియు వరల్డ్ వైడ్ సినిమాలు కూడా ఉండగా

 వరల్డ్ సినిమా గా మాత్రం దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేసిన భారీ సినిమా ప్రాజెక్ట్ కే అయితే రాబోతుంది.

 ప్రస్తుతానికి ఈ సినిమానే ఇండియా సినిమా దగ్గర మంచి కాస్ట్లీ ప్రాజెక్ట్ గా వస్తుండగా ఈ సినిమాపై లేటెస్ట్ గా అయితే టాలీవుడ్ లో కొన్ని గాసిప్స్ బయటకి వచ్చాయి.

 రావడంతోనే పెద్ద ఎత్తున వైరల్ గా కూడా మారాయి. మరి ఈ సినిమా కూడా రెండు భాగాలుగా అయితే వస్తున్నట్టుగా తెలిసింది.

 దీనితో ఈ టాక్ ఒక్కసారిగా ఊపందుకోగా అసలు దీనిపై ఇప్పుడు క్లారిటీ తెలుస్తుంది. దీని తో అయితే ఈ సినిమా ఎలాంటి రెండు భాగాలుగా తీసే ప్లాన్ లేదట.

 దీనితో ప్రాజెక్ట్ కే ప్రస్తుతానికి ఒక్క సినిమాగా మాత్రమే వస్తుంది అని చెప్పుకోవచ్చు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తుండగా

 అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు అలాగే భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ వారు ఈ సినిమాని వహిస్తున్నారు.