సౌత్ ఇండియా సినిమా దగ్గర స్ట్రాంగెస్ట్ వుమెన్ గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు పలు భారీ సినిమాలు సహా పలు వెబ్ సిరీస్ లు చేస్తున్న సంగతి తెలిసిందే.
మరి వాటిలో తన పాన్ ఇండియా సినిమా “శాకుంతలం” కూడా ఒకటి. అయితే ఈ సినిమా వచ్చే నెల రిలీజ్ కి ఫిక్స్ చేయగా.
సమంత ఈ సినిమా చేస్తున్న సమయంలోనే మాయో సైటిస్ అయితే వ్యాధి బారిన పడడం దానికి చికిత్స తీసుకుంటూనే ఈ సినిమా ప్రమోషన్స్ షూటింగ్ డబ్బింగ్ లాంటివి కూడా చేసింది.
మరి సమంత తన వివాహ బంధం బ్రేక్ చేసుకున్న తర్వాత మరింత స్ట్రాంగ్ కం బ్యాక్ ఆమె అందుకోగా
ఇక మళ్ళీ నెక్స్ట్ ఆమె లైఫ్ లో లవ్ గాని పెళ్లి సంబంధించి కానీ ఎలాంటి కమిట్మెంట్ కి మళ్ళీ ఆమె వెళ్ళలేదు.
అయితే ఈసారి వాలెంటైన్స్ డే కి మాత్రం ఆమె సూపర్ పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది.
ఈసారి వాలెంటైన్స్ డే కి ఇంటెన్స్ బాక్సింగ్ సెషన్ లో అయితే ఆమె పాల్గొన్నట్టుగా సామ్ సూపర్ పిక్ పెట్టి తెలిపింది.
దీనితో సమంత నుంచి ఈ రకం వాలెంటైన్స్ డే విషెష్ ఊహించని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే వీటికి పలువురు స్టార్ హీరోయిన్లు మరియు బాలీవుడ్ స్టార్స్ కూడా రిప్లై లు అందించి ఈ నిరంతర వారియర్ కి మరింత బలం చేకూరాలని కోరుకుంటున్నారు.
అయితే ఇప్పుడు సమంత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఈ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.